మహిళలను నమ్మి రెండు కోట్లు మోసపోయా

లెటర్ రాసి కానిస్టేబుల్ అదృశ్యం... నంద్యాలలో కలకలం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ కనపడడం లేదు అనే వార్త కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే బేతంచెర్ల కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సోమ్లా నాయక్ ఇంట్లో కాగితంపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక మహిళను నమ్మి రెండు కోట్ల రూపాయల అప్పులు చేశానని,తన వద్దనున్న సొమ్ముతో బ్యాంకులో రుణాలు తీసుకొని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, రుణాలు తీసుకున్న వారి నుండి రుణాలు తీర్చాలని ఒత్తిడి అధికమవడం, రియల్ ఎస్టేట్లో పెట్టిన చోట డబ్బులు తిరిగి రాకపోవడం మహిళను నమ్మి మోసపోయానని, ఎస్పీ గారు తన కుటుంబాన్ని కాపాడాలని లేఖ రాసి ఇంటి నుండి వెళ్లిపోయాడని సోమ్లా నాయక్ భార్య,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరవుతూ డోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్ సోమ్లా నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: