డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ 

-షాదాన్ హాస్పిటల్లో డాక్టర్ ముహమ్మద్ విజారత్ రసూల్ ఖాన్ కు ఘనంగా నివాళులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

షాదాన్ హాస్పిటల్లో జనవరి 30న ప్రారంభమైన డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంపుకు రోగులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నగరం నలు మూలల నుంచి పెద్ద ఎత్తున రోగులు ఉచిత వైద్యం కోసం బారులు తీరుతున్నారు. మంగల్ హాట్, ధూల్ పేట్, చిష్తీ చమన్, సబ్జీ మండీ, హకీం పేట, బండ్లగూడ, చంద్రాయణ గుట్ట, ఫలక్ నుమా, చార్మినార్, మెహదీపట్నం తదితర ప్రాంతాల నుంచి రోగుల తాకిడి ఎక్కువుగా ఉంది. ఈ క్యాంపు మొదలైన వారం రోజుల వ్యవధిలో పది వేలకుపైగా ఉచిత వైద్యాన్ని పొందారు. 2700 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా చేరి వైద్యం పొందుతున్నారు. 477 రోగులకు సర్జరీలు చేశారు. 65 మంది గర్బిణీలకు ప్రసవాలు చేశారు. ఇందులో కొన్ని సిజీరియన్ ద్వారా ప్రసవాలు జరిగాయి. నవజాత శిశువులకు చైల్డ్ డెవలప్ మెంట్ మానిటరింగ్ అండ్ స్క్రీనింగ్, జనరల్ హెల్త్ అండ్ స్ర్కీనింగ్ క్లినిక్స్ ఫర్ వేరియస్ డిసీజెస్ స్థాపించారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగులకు చికిత్స అందించేందుకు లైఫ్ స్టయిల్ క్లినిక్ ప్రారంభించామని హాస్పిటల్ సూపరింటెండెంట్ వసంత ప్రసాద్ తెలిపారు. 21529మందికి ల్యాబ్ పరీక్షలు చేశామని అన్నారు. హిస్టో పాథాలజీ, రేడియాలజీ, ఇమేజింగ్, ఎక్స్ రే, సిటీ స్కాన్, అల్ర్టా సౌండ్, ఐవిపి బెరియమ్ తదితర పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నామన్నారు. ఈ క్యాంపు షాదాన్ విజారత్ రసూల్ ఖాన్ గారి పర్యవేక్షణలో, షాదాన్ వైస్ ఛైర్మన్ ఏజాజుర్రహ్మాన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర ముహమ్మద్ సారిబ్ రసూల్ గార్ల పర్యవేక్షణలో జరుగుతుంది.

 

డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ కు ఘన నివాళులు..

ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంపుకు వచ్చిన రోగులు, వారి బంధువులు డాక్టర విజారత్ రసూల్ ఖాన్ కు ఘనంగా నివాళులర్పించారు. తండ్రి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్న డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ ను వారంతా ఎంతగానో కొనియాడారు. పేద పిల్లలకు వైద్య విద్యనందిస్తూ, పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ సేవా దృక్పథాన్ని కీర్తించారు. 

నగరం నలుమూలల నుంచి రోగులకు ఉచితరవాణా సౌకర్యం

సిటీలోని పలు ప్రాంతాల నుంచి రోగుల రవాణా కోసం ఉచిత బస్సుసౌకర్యం ఏర్పాటు చేశామని హాస్పిటల్ సూపరింటెండెంట్  చెప్పారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని రవాణా తదితర  వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు : 9676311747, 8686285796, 9849019535, 9000988544, 9985230806, 9885751975, 9866606046, 9966112448, 7032414388

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: