మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న..

ఉచిత వైద్య శిబిరాలకు సహకరించండి

రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలైన శ్రీశైలం, మహానంది,యాగంటి, భోగేశ్వరం వంటి శైవ క్షేత్రాలకు భక్తులు అశేష సంఖ్యలో వస్తుంటారని భక్తులకు, ప్రజలకు, పిల్లలుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ప్రముఖ శైవ క్షేత్రాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని, ఉచిత వైద్య శిబిరాలకు సహకరించవలసిందిగా జిల్లా అధికారులను, మెడికల్ షాప్ యాజమాన్యాలను, మెడికల్ ఏజెన్సీలవారిని, స్వచ్ఛంద సంస్థ సేవకులకు నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ పర్ల దస్తగిరి పిలుపు నిచ్చారు.రెడ్ క్రాస్ సంస్థ పిలుపు మేరకు స్పందించి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వున్న కాత్యాయని మెడికల్ స్టోర్స్ యాజమాన్యం వినోద్  దాదాపు 30 వేల రూపాయల విలువ కలిగిన మందులను రెడ్ క్రాస్ సంస్థకు విరాళంగా అందజేశారు.


ఉచిత మందులను పంపిణీ చేసిన కాత్యాయని మెడికల్ షాప్ యాజమాన్యం వినోద్ ని రెడ్ క్రాస్ సభ్యులు అభినందించారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి, వైస్ చైర్మన్ మారుతి కుమార్ లు పాల్గొన్నారు.రెడ్ క్రాస్ వైద్య శిబిరాలకు సహకరించదలచిన వారు 8977 750583 నంబర్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: