గడివేముల మండలాభివృద్ధి అధికారులు
నా వైపు.... ఒకసారి చూడండి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక గడివేముల పాత బస్టాండు నుండి కొర్రపోలురు వెళ్ళు ప్రధాన రహదారిలో కాలువ మీద గుంతపడి నెలలు కావస్తున్న ఆర్ అండ్ బి అధికారులు గాని,గ్రామ పంచాయతీ సిబ్బంది గాని మరమ్మతులు చేసే నాధుడే లేరని,గ్రామాల అభివృద్ధి చేసేందుకు తగుచర్యలు తీసుకోవాలని మండల స్థాయి సర్వసభ్య సమావేశాలలో చెప్పే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు,అధికారులు ఈ రహదారి గుండా కర్నూలు,నందికొట్కూరు, వెలుగోడుకు ప్రతిరోజూ గడివేముల పాత బస్టాండు రహదారి మీదుగా వాహనాలపై ప్రయాణాలు చేస్తూ కూడా పాత బస్టాండ్ లో కాలువపై పడిన గుంతను మాత్రం కన్నెత్తైనా చూడరు,చూసిన చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు తప్ప రహదారిలో కాలువపై పడ్డ
గుంతకు మాత్రం మరమ్మత్తులు చేసే ప్రయత్నాలు మాత్రం చేయరని,రాత్రి సమయాలలో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగి విద్యుత్ నిలిచిపోతే పాత బస్టాండ్ లో ఉన్న గుంత కనిపించక కొందరు,ఆదమరచి బాటసారులు,ద్విచక్ర వాహనదారులు గుంతలో పడి గాయాల పాలై ఆస్పత్రికి వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయని,అధికారుల దృష్టికి వెళ్లిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని పాత బస్టాండ్ రహదారిలో కాలువపై పడిన గుంతకు మరమ్మతులు చేసి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా కాపాడాలని బాటసారులు,వాహనదారులు కోరుకుంటున్నారు.
Home
Unlabelled
గడివేముల మండలాభివృద్ధి అధికారులు,,, నా వైపు.... ఒకసారి చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: