పోలీసులను బెదిరించిన కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
వివరాలు వెల్లడించిన హుస్సేనీ ఆలం ఇన్ స్పెక్టర్ నరేష్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
విధి నిర్వహణలోవున్న పోలీసులను అడ్డుకొని వారిని బెదిరించిన కేసులో అఖీలుద్దీన్ అనే యువకుడికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నరేష్ వెల్లడించారు. మంగళవారంనాడు చీఫ్ మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ డి.దుర్గా ప్రసాద్ ఈ తీర్పును వెలువరించారు. ఇదిలావుంటే మొదటి విడత కరోనా లాక్ డౌన్ సమయంలో అనగా 2020 సంవత్సరంలో పంచ్ మొహాల్లా వద్ద లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకొని అఖీలుద్దీన్(30) అనే వ్యక్తి వారిని బెదరించాడు. మొఘల్ పురలో నివాసముండే అఖీలుద్దీన్ సెల్స్ మెన్ గా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలో అఖీలుద్దీన్ పై హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం అఖీలుద్దీన్ కు కోర్టు ఒక ఏడాది సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 3,200/ జరిమాన విధించినారు. ఈ కేసు లో సహాయక పబ్లిక్ ప్రొసీక్యూటర్ ఎం.సుధాకర్ ప్రాసెక్యూషన్ తరుపున తన వాదనను వినిపించారు. ఈ కేసు విషయంలో మేజిస్ట్రేట్ హుస్సేని ఆలం కోర్టు సిబ్బందిని అభినందించారు.
Home
Unlabelled
పోలీసులను బెదిరించిన కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష ,,, వివరాలు వెల్లడించిన హుస్సేనీ ఆలం ఇన్ స్పెక్టర్ నరేష్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: