జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ..
యాజమాన్య... సిబ్బందిపై కేసు నమోదు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామానికి చెందిన ఫరిధా బేగం(45) తన పొలంలో ఉన్న జొన్న పంటను జెఎస్ డబ్ల్యు యాజమాన్య సిబ్బంది పంటను నాశనం చేసిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్య సిబ్బందిపై గడివేముల పోలీసులు కేసు నమోదు చేయాలని తెలిపింది.వివరాల్లోకి వెళితే బిలకలగూడూరు గ్రామానికి చెందిన ఫరీదా బేగం తన సర్వే నెంబర్ 248/4 లో వున్న 5 ఎక్కరముల పొలమును జెఎస్ డబ్ల్యు ఫాక్టరీ పొలము సేకరలో భాగంగా ఫరీదా బేగం ఒరిజినల్ పట్ట తీసుకోని నష్ట పరిహారం చెల్లించకుండా మోసం చేశారని,2021 లో ఫరీదా బేగం,భర్త షఫీ ఉల్లా బేగ్ పొలము వద్ద పని చేసుకుంటూ ఉండగా జెఎస్ డబ్ల్యూ ఫాక్టరీ యాజమాన్య సిబ్బంది తమ పొలము లోకి అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించి జొన్న పంటను నాశనం చేసి సుమారు 1,00,000/- రూపాయల ఆస్తి నష్టం కలగజేశారని,పంట నష్ట పరిహారం అడిగితే నీఅంతు చూస్తాం అని బెదిరించిన జెఎస్ డబ్ల్యూ ఫాక్టరీ యాజమాన్య సిబ్బంది వీరబాబు,సాంబశివరావు, ఖాదర్ భాష,అనిల్ కుమార్,నీలి కుమార్,శర్మ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు గడివేముల ఎస్సై బీటీ. వెంకటసుబ్బయ్య తెలిపారు.
Home
Unlabelled
జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ.. యాజమాన్య... సిబ్బందిపై కేసు నమోదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: