రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో న్యాయవాదుల సంక్షేమానికి...
రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వెయ్యాలి
సామాజిక కార్యకర్త, న్యాయవాది మహమ్మద్ నిజామోద్దిన్ రషీద్ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-సంగారెడ్డి ప్రతినిధి)
రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వెయ్యాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది మహమ్మద్ నిజామోద్దిన్ రషీద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,, శుక్రవారం నుండి ప్రారంభం కానున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల్లో సోషల్ ఇంజనీర్స్ గా పిలువబడే న్యాయవాదుల సంక్షేమము కొరకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో పెద్దపీట వెయ్యాలి అని కోరారు. అలాగే న్యాయవాదులు ఎదుర్కుంటున్న సమస్యలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుపుతూ,1)"న్యాయవాదుల రక్షణ చట్టం" రూపకల్పన కొరకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ సాక్షిగా తీర్మానాన్ని ఆమోదించి చట్ట రూపకల్పన కొరకు కేంద్రానికి పంపాలి. 2) జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల రూ.15,000/- (పదిహేను వేలు) చొప్పున స్టైఫండ్ ఇవ్వాలి. జూనియర్ న్యాయవాది వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి కావలసిన వస్తు సామగ్రిని ఇప్పించాలి మరియు 75% సబ్సిడీతో కూడిన రూ.5,00,000/- (ఐదు లక్షలు)ల లోన్స్ ఇవ్వాలి. 3) న్యాయవాదులకు నిరంతరం వృత్తి నైపుణ్యంగల శిక్షణ తరగతులు నిర్వహించాలి, అందుకొరకు న్యాయవిజ్ఞాన కేంద్రం (లా అకాడమీ)ని ఏర్పాటు చేయాలి. 4). న్యాయవాద వృత్తిలో కొనసాగే న్యాయవాదులు మృతి చెందితే, బార్ కౌన్సిల్ చెల్లించే ఆర్ధిక సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ.10,00,000/-(పది లక్షలు) ఇచ్చి ఆ కుటుంబాలను ఆర్దికంగా ఆదుకోవాలి. 5) అర్హులైన న్యాయవాదులకు అందరికీ ఇళ్ళ స్థలాలూ ఉచితంగా ఇవ్వాలి మరియు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఆర్ధిక సహాయం అందించాలి. 6) రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మన బార్ కౌన్సిల్ కు కనీసం 100 కోట్ల గ్రాంట్స్ ఇవ్వాలి. 7) న్యాయవాదులకు అందరికీ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఇవ్వాలి, వయోపరిమితి లేకుండా కుటుంబ సభ్యులందరి ముఖ్యంగా తల్లి తండ్రులకు అందరికీ వర్తించేలా హెల్త్ కార్డులను అందుబాటులోకి తీసుకురావాలిని. ప్రసవంతో సహా అన్ని చికిత్సలను హెల్త్ కార్డ్ లో చేర్చాలి. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులను వినియోగంలోకి తీసుకురావాలి. 8) అనారోగ్యంతో లేదా వయోభారంతో కోర్టులకు రాలేని విశ్రాంత న్యాయవాదులకు ప్రతి నెల రూ.15,000/- (పదిహేను వేలు)లను పెన్షన్ తరహాలో అందించాలి. 9) కోర్టు సిబ్బందిని పెంచాలి, అందుకు తగిన నోటిఫికేషన్స్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. 10) 41(A) of Cr.P.C ని సవరించాలి మరియు ఇతర వృత్తిపరమైన ఇబ్బందులను సరిచేయల్సిన అవసరం ఉంది, అందుకు న్యాయవాదులు ఇక్యమత్యంగా ముందుకు రావాలి అని అభిప్రాయ పడ్డారు.
Home
Unlabelled
రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో న్యాయవాదుల సంక్షేమానికి... రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వెయ్యాలి,,, సామాజిక కార్యకర్త, న్యాయవాది మహమ్మద్ నిజామోద్దిన్ రషీద్ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: