ఆర్టీసీ బస్టాండ్ల ప్రైవేటీకరణ ఆలోచన తగదు
సిపిఐ (యంయల్)ఆర్ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్లను దశవారీగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు లీజు ప్రతిపా దికన కట్టబెట్టాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని సిపిఐ (ఎంఎల్)ఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోవెలకుంట్లకు విచ్చేసిన సిపిఐ (యంయల్)ఆర్ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ గారు సమావేశం నిర్వహించి,కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో మదనపల్లి బస్టాండ్ ను ఎంపీక చేసి ప్రతిపాదన సిద్ధం చేశారని దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీ బస్టాండ్లను 33 సంవత్సరాలు పాటు కట్టబెట్టాలనే ఆలోచన విధాన చర్యలు మానుకోవాలని,ఆర్టీసీ బస్టాండ్ ల వినియోగానికి లీజ్ కు ఇచ్చేందుకు ఈనెల 14వ తేదీన ఆర్టీసీ కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని చేసిన ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ కాలం లీజుకు కట్టబెట్టడం ద్వారా రానున్న కాలంలో అవి ప్రైవేట్ కంపెనీ వ్యక్తుల ఆధీనంలోనే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చడానికి ఇతర మార్గాలు వున్నాయని, లీజు పేరుతో ఆర్టీసీ బస్టాండ్లను విచ్చలవిడిగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్యని, తక్షణమే ప్రయత్నాలు మానుకోవాలని లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలను బస్టాండ్ ఆవరణలో చేస్తామని హెచ్చరించారు.
Home
Unlabelled
ఆర్టీసీ బస్టాండ్ల ప్రైవేటీకరణ ఆలోచన తగదు ,,, సిపిఐ (యంయల్)ఆర్ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: