బండ్లగూడ లో వెలసిన జాస్పర్ షోరూం

ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చంద్రన్న గుట్ట లోని బండ్లగూడ నందు ఏర్పాటుచేసిన టాటా మోటార్స్ కాల షో రూం ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ బాడీగ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పాత నగరంలో సైతం కొత్త నగరానికి పెద్ద పెద్ద షోరూం రావడం ప్రశ్నించదగ్గ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బాడిగ మాట్లాడుతూ సుమారు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షో రూమ్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దాదాపు 68 ఏళ్ల చరిత్ర కలిగిన తమ కంపెనీకి సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ ,గుంటూరు, వైజాగ్ లలో షో రూమ్ లో ఉన్నాయని ఆయన తెలియజేశారు. టాటా టీయాగో 7 లక్షల నుండి సఫారీ 28 లక్షల వరకు వివిధ మోడల్ ధరలలో కారు లభిస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాలు విషయంలో 80 శాతం మార్కెట్ కలిగి ఉన్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జోనల్ మేనేజర్ నితుల్ శర్మ జేఎస్ఎం రాకేష్ రెడ్డి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: