శ్రీశైలంలో భక్తుల ఉచిత సేవల కోసం...
అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు
జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. శ్రీశైలానికి వచ్చిన భక్తులు త్రాగునీరు, వైద్య సదుపాయం,ట్రాఫిక్ తదితర అత్యవసర సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్లు 08524-287004, 08524-287288, 08524-287289 లకు ఫోన్ చేసి సమాచారం తెలియజేసిన వెంటనే పరిష్కార మార్గ నివారణ చర్యలు తీసుకుంటామని,
భక్తులు అసౌకర్యానికి గురైన,పాదయాత్రలో అవాంతరాలు ఏర్పడినా, బంధు మిత్రులు తప్పిపోయిన, ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు వైద్య సహాయ అత్యవసర సేవల నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే సంబంధిత శాఖలకు సమాచారాన్ని చేరవేసి భక్తులకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించేందుకు వీలుగా సిబ్బందిని ఏర్పాటు చేశామని,భక్తులు అసౌకర్యానికి గురైనప్పుడు అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లు వినియోగించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ శ్రీశైలానికి విచ్చేయు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
Home
Unlabelled
శ్రీశైలంలో భక్తుల ఉచిత సేవల కోసం... అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు ,,,, జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: