ఎస్సీ కాలనీలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయండి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక పాణ్యం ఎస్సీ కాలనీ లోని ప్రజలకు అధికారంలోనికి వచ్చిన వెంటనే పబ్లిక్ మరుగుదొడ్లను కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల కాలమైనా ఇంతవరకు కట్టలేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వనం వెంకటాద్రి, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బత్తిన ప్రతాప్ లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాణ్యం ఎస్సీ కాలనీలో 2000 జనాభా ఉండగా ఎస్సీ కాలనీలో 2 పబ్లిక్ మరుగుదొడ్లు ఉండగా, ఎస్సీ కాలనీ ప్రజలకు ఎలాంటి సమాచారము ఇవ్వకుండానే 2021లో మరుగుదొడ్లను పడగొట్టారని, వైయస్సార్సీపి ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి మీ సమస్యలను అధికారంలోకి వచ్చాక  తీరుస్తామని  చెప్పి ఎస్సీ కాలనీ ప్రజలు అడిగిన ఏ ఒక్క హామీని కూడా తీర్చలేదని, ఎస్సీ కాలనీలో ఏమి అభివృద్ధి చేసారో బహిరంగగా చెప్పాలని,


స్థానిక శాసనసభ సభ్యులు ఇంతవరకు ఎస్సీ కాలనికి ఒక్కసారి కూడా రాలేదని, కాలనీలో 8 మంది వాలంటీర్ లు ఉన్నా ప్రయోజనం శూన్యమని, కాలనీలో చెత్త ఎక్కువగా పేరుకుపోవడంతో దోమల నివాస కేంద్రాలుగా మారి ప్రజలు మలేరియా, టైఫాయిడ్,డెంగ్యూ వంటి ఆనారోగ్య సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు,వీధి దీపాలు, కాలువలు,రోడ్లు వేస్తామని ఇచ్చిన హామీలు హామీలు గానే మిగిలిపోయాయని, హామీలు నెరవేర్చమని  అధికారులని ప్రశ్నిస్తే మా పైన అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,శాసనసభ సభ్యులు ఎస్సీ కాలనీలో గడప గడప కార్యక్రమానికి వస్తే ప్రజలందరం కలిసి అడ్డుకుంటామని,కాలువలు,రోడ్లు,పబ్లిక్ మరుగుదొడ్లు నిర్మించి మాకాలనీలోకి అడుగు పెట్టాలని,లేకుంటే మహిళా సంఘాలతో,ఎస్సీ కాలనీ  ప్రజలతో అధికారుల కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వెంగమ్మ, సాలమ్మ,సామక్క, ఎస్సీ కాలనీ మహిళలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: