శ్రీ మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న
బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పట్టణంలో శ్రీ మల్లన్న స్వామి జాతరకు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా బుక్క వేణుగోపాల్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, మెండే కుమార్ యాదవ్, యాదవ సోదరులు బిజెపి నాయకులు పాల్గొన్నారు. అదే సందర్బంలో బుక్క వేణుగోపాల్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు వివాహా వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment:
0 comments: