కంటి వెలుగును ఉపయోగించుకోండి.. 

పురాణపుల్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పురానాపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ కోరారు. డివిజన్లోని మహిళలకు కోసం ఏర్పాటుచేసిన తాళీమ్ కేంద్రంలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అర్హులైన వారు ఈ కేంద్రాన్ని సందర్శించి కండ్లను పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా కంటి అద్దాలను పొందాలని ఆయన కోరారు. పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు తప్పకుండా ఆధార్ కార్డు తీసుకుని రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగ్నిశిఖ, సిబ్బంది జ్యోతి, మాధవి, సంగీత, ఎంఐఎం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: