రబి 2022 లో పంటలు వేసిన రైతులు...

తప్పని సరిగా ఈకేవైసీ చేయించుకోవాలి

వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలో రబి 2022 సంవత్సరానికి ఈ పంటల నమోదును 3176 మంది రైతులు11,832 ఎకరాలలో  జొన్న, వరి, మినుము, మొక్కజొన్న, పప్పుశనగా, సోయాబీన్ వంటి వివిధ రకాలైన పంటలను నమోదు చేసుకోన్నారని, ఈ పంట నమోదులో రైతుల యొక్క వేలిముద్ర తప్పనిసరి అయినందున 1878 మంది రైతులు మాత్రమే వేలిముద్రతో పంటలను నమోదు చేసుకున్నారని,


1300 మంది రైతులు వేలిముద్ర వేసేందుకు ఆర్బికే సిబ్బందిని సంప్రదించి వేలిముద్ర వేయడం ద్వారా లేదా ఆధార్ లింక్ అయిన ఫోను కు ఓటిపి రావడం ద్వారా రైతులందరూ వేలిముద్ర వేసి ఈ కేవైసీ తప్పనిసరిగా చేపించుకోవాలనీ, వ్యవసాయ,ఉద్యాన శాఖ మరియు రెవెన్యూ అధికారులు గడివేముల మండలంలో పంటల తనిఖీలలో భాగంగా 607 మంది రైతులు వేసిన  వివిధ రకాలైన పంటలను పరిశీలించినట్లు గడివేముల మండలం వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: