కాకినాడ ఆర్టిసి బస్సు బోల్తా
పదిమందికి గాయాలు
(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని జూటూరు రుద్రవరం గ్రామాల మధ్యలోఉన్న ఊట వాగు సమీపంలో కాకినాడ కు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన వివరాల గురించి పాములపాడు పోలీసులు తెలుపుతూ కర్నూలు నుండి కాకినాడ కు బయలుదేరిన కాకినాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ AP52.5094 బస్సు పాములపాడు మండలం జూటూరు గ్రామం చేరుకోగానే ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేకులు వేయడంతో బస్సుకు బ్రేకులు పడక బస్సు అదుపు తప్పి ప్రమాదం జరిగిందని,బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా వారిలో 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయని,స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Post A Comment:
0 comments: