యువత అన్ని రంగాల్లో రాణించాలి

యువ నాయకులు  పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

జల్పల్లి మున్సిపాలిటీలో వాదీ-ఏ. ముస్తఫా క్రికెట్ లీగ్ టోర్నమెంటును ప్రారంభించిన పటోళ్ల కార్తీక్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

జల్పల్లి మున్సిపాలిటీలో వాదీ-ఏ. ముస్తఫా క్రికెట్ లీగ్ టోర్నమెంటును తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు  పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం నాడు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో జల్పల్లి మున్సిపాలిటీ లో  వాదీ..-ఏ -ముస్తఫా లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని క్రికెట్ లీగ్ నిర్వాహ కమిటీ స్థానిక ప్రజా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికి, పూలమాలతో శాలువాతో సన్మానించారు.యువ నాయకులు క్రీడాకారులను పరిచయం చేసుకొని , అనంతరం టాస్ వేసి కొంతసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను  ఉత్సాహపరచడం జరిగినది.


యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి 
మాట్లాడుతూ నేటి యువత అన్ని రంగాల్లో రాణించాలని, అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయిలో అంత రాష్ట్రా స్థాయిలో ప్రతిభ కనబరచాలని ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ రిప్రెజెంటేటివ్ వైస్ చైర్మన్ శ్రీ .యూసఫ్ పటేల్ , జల్పల్లి మున్సిపల్ కార్యనిర్వాహక అధ్యక్షులు  షేక్ జహంగీర్ , కౌన్సిలర్ శంషుద్దీన్, షేక్ అఫ్జల్ , సౌద్ అవాల్గి, జల్పల్లి మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత, యూత్ నాయకులు మున్సిపాలిటీ మైనార్టీ అధ్యక్షులు .హుస్సేన్ , బవాజీర్ తదితరులు ఉన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: