నిరుద్యోగ యువతీ యువకులకు ఆశాదీపం సెట్విన్

చార్మినార్ శాసనసభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ఆశాదీపంగా నిలుస్తోందని చార్మినార్ శాసనసభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. సెట్విన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.  సోమవారం సెట్విన్ మోతి గల్లి శిక్షణ కేంద్రంలో వివిధ వృత్తి విద్యా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ యువకులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణుగోపాలరావు ఆధ్వర్యంలో స్థానిక చౌహల్లా ప్యాలెస్ ఆవరణలో ఉన్న ఉర్దూ మస్తాన్ లో జరిగింది. సర్టిఫికెట్లను ప్రధానం చేసిన అనంతరం ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ  నిరుద్యోగులకు సెట్విన్  లో అందిస్తున్న ఉపాధి మృతి విద్యా కోర్సులు యువతకు మేలు చేస్తున్నాయని ముఖ్యంగా స్వయం ఉపాధిలో ఆ సంస్థ నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో మంచి అవకాశం కల్పిస్తుందని అన్నారు.


సెట్విన్ సంస్థ అందిస్తున్న వివిధ ఉపాధి కోర్సులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు. సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు మాట్లాడుతూ సేట్విన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని,  శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా జాబ్ మేళాల ద్వారా తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా  వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ పొందిన వారికి మెరిట్ ప్రాతిపదికన జ్ఞాపికలను, సర్టిఫికెట్లను బహుకరించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎకౌంట్స్ ఆఫీసర్, పీ. ఓం ప్రకాష్ , మేనేజర్ ఏం ఏ. Moiz, సూపరింటెంట్ పిబిఎస్ ప్రసాద్, మోతిగల్లి శిక్షణా కేంద్రం ఇంచార్జ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  అంతకుముందు సంస్థ ద్వారా అందిస్తున్న కోర్సులను నిర్వహిస్తున్న కార్యకలాపాలను మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు  వివరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: