వేలాదిగా జనం తరలిరాగా..ఎనిమిదవ నిజాం ముఖ్రంజా అంత:క్రియలు

అధికార లాంచనాలతో మక్కా మసీదులో ఖననం

హాజరైన హోంమంత్రి మహమ్మద్ మహమ్మూద్ అలీ, ఎంఐఎం నేతలు, కార్పోరేటర్లు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

వేలాది జనం తరలిరాగా..ఎనిమిదవ నిజాం ముఖ్రంజా అంత:క్రియలు ప్రభుత్వ అధికార లాంచనాలతో మక్కా మసీదు నందు ముగిశాయి. ఈ అంత:క్రియల కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ మహమ్మూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు పాల్గొన్నారు. అంత: క్రియలకు ముందు  ముఖ్రంజా బౌతికకాయాన్ని చౌమోల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదుకు తీసుకొచ్చారు. ఈ అంతిమ యాత్రలో హైదరాబాద్  కు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. దారిపోడువున నిజాం ముఖ్రంజా భౌతికకాయాన్ని పోలీసుల గౌవరవందనంతో తీసుకెళ్లారు. అనంతరం  మక్కా మసీదులో నిజాం ముఖ్రంజా అంత:క్రియలు పూర్తిచేశారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: