తాజ్‌మహల్ వద్ద మేఘన్‌ అందుకోసమే ఫోటో దిగలేదటా

ఐదేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మర్కెల్ తాజ్‌మహల్‌ను సందర్శించారు. సాధారణంగా తాజ్‌ను సందర్శించిన వారు ఎవరైనా అక్కడ ఫొటో దిగకుండా వెనక్కి రారు. అయితే, మేఘన్ మాత్రం ఫొటో తీసుకోలేదు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అప్పుడు అక్కడ మేఘన్ ఎందుకు ఫొటో దిగలేదన్న ఆసక్తికర విషయాన్ని ప్రిన్స్ హ్యారీ తన పుస్తకం ‘స్పేర్’లో వెల్లడించారు.

పాలరాతి కట్టడమైన తాజ్‌మహల్ ముందు ఫొటో దిగొద్దని మేఘన్‌కు తానే చెప్పానని అందులో పేర్కొన్నారు. ఆ అద్భుత కట్టడం వద్ద తన తల్లి ప్రిన్స్ డయానా ఫొటో దిగారని, ఆ ఫొటోకు విపరీతమైన పాప్యులారిటీ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. మేఘన్ కూడా అక్కడ ఫొటో దిగితే ఆమె తన తల్లిని అనుకరిస్తోందని అనుకుంటారని, అది తనకు ఇష్టం లేకపోవడం వల్లే అలా చెప్పానని హ్యారీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 

ఇదిలావుంటే ఓ చారిటీ కార్యక్రమంలో భాగంగా జనవరి 2017లో భారత్ వచ్చిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లకు అప్పటికి వివాహం కాలేదు. అప్పటికి ఆమె హ్యారీ ప్రియురాలిగానే ఉన్నారు. ఆ తర్వాతే ఆమె వివాహం జరిగింది.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: