తెలంగాణలో కాషాయ జెండా రెపరెప

కేంద్ర.. రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

విజయవంతంగా సాగిన వనపర్తి నియోజకవర్గ పోలింగ్  బూత్ సభ్యుల సమన్వయ సమ్మేళన కార్యక్రమం

(జానో జాగో వెబ్ న్యూస్-వనపర్తి ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా రేపరిపలాడటం ఖాయమని  బిజెపి రాష్ట్ర నాయకులు, వనపర్తి నియోజకవర్గం పాలక్ బుక్క వేణుగోపాల్ స్పష్టం చేశారు. వనపర్తి నియోజకవర్గం తో పాటు రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి విజయడంక మోగిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ శనివారం నాడు వనపర్తి నియోజకవర్గం లోని బిజెపి పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.


వనపర్తి నియోజకవర్గం లోని ప్రతి బిజెపి కార్యకర్తలతో నేరుగా సమన్వయం చేసుకుంటూ వస్తున్న బుక్క వేణుగోపాల్ పార్టీ పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇక బిజెపికి తిరుగు లేదని వెల్లడించారు. అధికార బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బిజెపికి మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలోకి వస్తుందని డబల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుతో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు.

ఇలా కార్యకర్తలను ఉద్దేశించి బొక్క వేణుగోపాల్ చేసిన ప్రసంగం వారిలో నూతన ఉత్తేజం నింపింది. ఈ పోలింగ్ బూత్ కార్యకర్తల సమన్వయ సమ్మేళన కార్యక్రమంలో ఉదయం పేరు నమోదు తో పాటు జ్యోతి ప్రజల అనంతరం మిస్డ్ కాల్ వంటి వివిధ కార్యక్రమాలను బుక్కా వేణుగోపాల్ దిగ్విజయంగా నిర్వహించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: