పాతబస్తీకి చెందిన బీజేపీ సీనియర్ నేత

డి.సత్యనారాయణ గుండెపోటుతో అకస్మిక మృతి

పార్టీలకు అతీతంగా నివాళ్లులర్పించిన నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీకి చెందిన బీజేపీ సీనియర్ నేత, భాగ్యనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు డి.సత్యనారాయణ గుండెపోటుతో అకస్మికంగా మరణించారు. ఆయన మరణంతో పాతబస్తీలో విషాదం ఛాయలు నెలకొన్నాయి. బీజేపీలో సుధీర్ఘకాంల నుంచి పనిచేస్తూ వచ్చిన డి.సత్యనారాయణ పార్టీ పరంగా పలు సేవాలు అందించారు.  జన్ సంఘ్ పార్టీగా బీజేపీ కొనసాగిన నాటి నుంచి డి. సత్యనారాయణ రాజకీయరంగ ప్రవేశం చేశారు. డి. సత్యనారాయణకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డి.సత్యనారాయణ మరణ వార్త తెలియగానే పలువురు నేతలు ఆయన పార్థికదేహాన్ని పరామర్శించి నివాళ్లులర్పించారు. బీజేపీ భాగ్యనరగ్ జిల్లా నాయకులు ఎస్.సురేందర్ రెడ్డి, గోల్కోండ జిల్లా బీజేపీ కార్యదర్శి ఉమా మహేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు దోరెటి ఆనంద్ గుప్తా, చార్మినార్, బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్లు సురేంద్, ప్రశాంత్, బీజేపీ నాయకులు వెంకటాచలం ముదిరాజ్, శ్రీనివాసచారి, టీఆర్ఎస్ నాయకులు సుంకరి రవీందర్, టీడీపీ నాయకులు శ్యాంసుందర్, నా‍‍యీ బ్రహ్మణ సంఘం హైదరాబాద్ పార్లమెంటు అధ్యక్షులు  శ్రీనివాస్ నాయీ, కార్యదర్శి  సంతోష్ తదితరులు డి. సత్యనారాయణకు నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నేతలంతా డి.సత్యనారా‍యణ పాతబస్తీకి అందించిన సేవలను కొనియాడారు. 


స్నేహితుడి యాదిలో సంతాప సభకు సంకల్పించి అనంత లోకాలకు 

బీజేపీ సీనియర్ నేత డి.సత్యనారాయణ బాల్య మిత్రుడొకరు నెలకిందట మరణించారు. ఆ సమయంలో అయ్యప్ప స్వామీ మాలలో ఉన్న డి.సత్యనారాయణ బాల్య మిత్రుడి అంత:క్రియల్లో పాల్గొనలేకపోయాడు. దీంతో అయ్యప్ప స్వామీ దీక్షవిరమించి వచ్చాక బాల్య మిత్రుడి యాదిలో సంతాప సభ ఏర్పాటు చేసేందుకు డి.సత్యనారాయణ సన్నాహాలు అన్ని పూర్తిచేశారు. సంతాప సభకు ఒక్కరోజు ముందు డి.సత్యనారాయణ తానే అకాల మరణానికిి గురయ్యారు. దీంతో బాల్య మిత్రుడి యాదిలో డి.సత్యనారాయణ తప్పించిన వైనాన్ని ఆయన సన్నిహితులు చర్చించుకొంటున్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: