శ్రీ రాజరాజేశ్వరి హై స్కూలులో..
విద్యార్థినులకు ముగ్గులపోటీలు నిర్వహించిన కరస్పాండెంట్ రామేశ్వరరావు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక గడివేముల శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ నందు విద్యార్థినులకు కరస్పాండెంట్ రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ కరస్పాండెంట్ రామేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థినిలకు చదువు, ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసి మానసిక ఆనంద ఉత్సవాన్ని నింపి ఉత్తేజ పరచడానికి విద్యార్థుల మధ్య ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని,
కొంతమంది విద్యార్థినిలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి,పోటీ భావంతో పాల్గొనడానికి సముకత చూపుతారని, అలాంటి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యంగా ముందడుగు వేసి మానసికంగా,శారీరకంగా ఆనందంగా ఉండడానికి, స్నేహభావం పెంపొందించేందుకు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.
Home
Unlabelled
శ్రీ రాజరాజేశ్వరి హై స్కూలులో.. విద్యార్థినులకు ముగ్గులపోటీలు నిర్వహించిన కరస్పాండెంట్ రామేశ్వరరావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: