సద్భావన స్ఫూర్తిని కాపాడుకోవడం కోసమే! 

- ధార్మిక జనమోర్చా స్టేట్ కన్వీనర్ జనాబ్ సాదిక్ అహ్మద్

భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేసే కుట్రలు ఇటీవలె కాలంలో పెచ్చరిల్లుతున్నాయి. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ధోరణి దేశ సమగ్రతకు ప్రమాదకరం. సమాజంలో శాంతి, సౌఖ్యం, సద్భావనతోనే మన దేశం పురోగతిలో ప్రయాణిస్తుంది! దేశ అభివృద్ధిని, మన విశిష్టతను ధ్వంసం చేసే విభజన రాజాకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి. ఈ విషయంలో రచయితలు, కవులు, జర్నలిస్టులు, ధార్మిక పండితులు ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ విషయాన్ని గుర్తించిన  ధార్మిక జనమోర్చా తెలంగాణ శాఖ సద్భావన సదస్సులు నిర్వహిస్తోంది! మోర్చా తెలంగాణ స్టేట్ కన్వీనర్ సాదిక్ అహ్మద్ ఆ పనుల్లోనే తీరికలేకుండా ఉంటారు. 

మత గురువులతో సమావేశాలు...

ధార్మిక జనమోర్చా వేదిక ద్వారా విభిన్న మత గురువులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరి మతాలను వారు ఆచరిస్తూనే ఎదుటి వారి మతాన్ని గౌరవించాలన్న సందేశాన్ని మత పెద్దలతో చెప్పించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ఒకరి మత సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమావేశాల్లో ధార్మిక జనమోర్చా వేదిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు అన్య మతాల పండితులు అభినందిస్తున్నారు. హైందవ మత గురువు చిన జీయర్ స్వామి సైతం ధార్మిక జన మోర్చా సేవలను కొనియాడారు. క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత గురువులు సైతం ధార్మిక జనమోర్చా వేదికను పంచుకున్నారు.


సత్ఫలితాలను ఇస్తున్న కవి సమ్మేళనాలు..

ధార్మిక జన మోర్చా ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తున్న కవి సమ్మేళనాలను తెలుగు రాష్ట్రాల సాహితీ పెద్దలు మెచ్చుకుంటున్నారు. శ్రీ కొలకలూరి ఇనాక్, శ్రీ నాళేశ్వరం శంకరం, శ్రీ గౌరీ శంకర్, తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి తదితర సాహితీ పెద్దల పర్యవేక్షణలో జరిగిన కవి సమ్మేళనాలు విజయవంతమయ్యాయి. పంద్రాగస్టు, ఛబ్బీస్ జనవరిని పురస్కరించుకుని జరిగిన ఈ సమ్మేళనాల్లో వందల సంఖ్యలో కవులు సద్భావన ప్రాముఖ్యతను తమ కవితల ద్వారా నొక్కిచెప్పారు. కులమతాలకతీతంగా కవులందరినీ ఒకచోట సమావేశపర్చడం నిజంగా అభినందనీయమే! ‘సద్భావన స్ఫూర్తిని కాపాడుకుంటేనే భారత దేశం అభివృద్ధి పథంలో ముందుకెళుతుంది. ధార్మిక జనమోర్చా ప్రయత్నాలన్నీ ఆ స్ఫూర్తిని కాపాడుకోవడం కోసమే!’ అంటారు సంస్థ స్టేట్ కన్వీనర్ జనాబ్ సాదిక్ అహ్మద్.

- ముహమ్మద్ ముజాహిద్ 96406 22076

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: