శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల నూతన మండలికి దరఖాస్తులు చేసుకోండి
ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామంలో వెలసి భారతదేశంలో దక్షిణ కాశీగా పేరు పొందుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తుచేసుకోవాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడివేముల మండలంలో నూతన ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ నుండి వెలువడిన నోటిఫికేషన్ ఉత్తర్వులను గడివేముల తాసిల్దార్ కార్యాలయం,గ్రామ సచివాలయ కేంద్రాలు మరియు ఆలయ కార్యాలయం వద్ద ఉంచామని,దరఖాస్తు చేసుకొనువారు 9 మంది సభ్యులతో కూడిన దరఖాస్తులను జనవరి 26 వ తేదీ లోపల దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కర్నూలు కార్యాలయం వారికి పంపించవలసినదిగా, పూర్తి వివరాల కొరకు శ్రీ దుర్గ భోగేశ్వర స్వామి దేవాలయం కార్యాలయం నందు సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.
Post A Comment:
0 comments: