అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలి

సిఐటియు ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేత 


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గడివేముల తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని,ధర్నా చేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ ఎమ్మార్వో కు అందజేశారు.ఈ సందర్భంగా నాగమణి అధ్యక్షతన సిఐటియు మండల కార్యదర్శి రామ మద్దిలేటి మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీలకు పేస్ యాప్ రద్దు చేయాలని, వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని,గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని,రేషన్ కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన ఆయిల్, కందిపప్పు వంటి నిత్యవసర సరుకులను నాణ్యమైనవి పంపిణీ చేయాలని,


హెల్పర్ల ప్రమోషన్లకు వయపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని,ప్రమోషన్ లో రాజకీయ జోక్యం ఉండరాదని,రాజకీయ వేధింపులు ఆపాలని ర్యాలీలు సభలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ హ్యాండ్ హెల్పర్స్ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు వసంతలక్ష్మి, రామచిన్నమ్మ, రాములమ్మ,జయలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: