నంద్యాల జిల్లా డిఎమ్‌హెచ్ఓ వెంకటరమణకి ఫిర్యాదు చేసిన...

క్రిటిక‌ల్ కేర్ హాస్పిటల్ బాధితులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని క్రిటిక‌ల్ కేర్ సెంట‌ర్ ఆసుప‌త్రిలో అత్య‌వ‌స‌ర వైద్య చికిత్స పేరుతో అధిక బిల్లులు వ‌సూలు చేస్తున్నారని,ఆసుప‌త్రిలో స‌రైన మౌలిక స‌దుపాయాలు లేవని, హాస్పిటల్ కు వచ్చిన వ్యాధిగ్రస్తుల నుండి  టెస్టుల పేరుతో అధిక రుసుము వసూలు చేస్తున్నారని, బిల్లుల‌పై ఆసుప‌త్రి యాజ‌మాన్యంతో వివ‌రాలు అడుగగా పోలీసుల‌తో బెదిరింపుల‌కు పాల్ప‌డి అడిగిన వారిని వేధింపుల‌కు గురి చేసి హాస్పిటల్ నుండి బయటికి వెళ్లి పోవాలని హెచ్చరిస్తున్నారని క్రిటికల్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలని వ్యాధిగ్రస్తుని సోద‌రుడు మ‌నోహ‌ర్ రెడ్డి డిఎమ్‌హెచ్ఓ వెంక‌ట‌ర‌మ‌ణ‌ గారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: