ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించినందుకు,,,

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన జల్పల్లి గ్రామ వాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించినందుకు మంత్రి సబితా  ఇంద్రారెడ్డికి స్థానిక జల్పల్లి గ్రామ ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ జలపల్లి గ్రామ ప్రజలు ఆదివారంనాడు మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డిని జిల్లెల గూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో  కలిశారు. జల్పల్లి మున్సిపాలిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు యంజాల జనార్ధన్, యువ నాయకులు యంజాల అర్జున్, ఆధ్వర్యంలో 245 మంది ఎస్సీ వర్గానికి చెందిన  ప్రజలు మంత్రిని కలిసి వారికి ఎస్సీ కమ్యూనిటీ భవనం కొరకు కేటాయించిన స్థలాన్ని కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. 


దీంతోపాటు స్థానిక సమస్య లు గురించి కూడా మంత్రికి తెలియజేశారు. చివరి మజిలీ కొరకు  రథం ఏర్పాటు చేయాలని కూడా వారు మంత్రిని కోరారు.  ఈ విషయాలను ఒపికతో విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాటి పల్ల సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలోో జల్పల్లి మాజీ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు ,ప్రస్తుతం జల్పల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి  క్రిష్ణారెడ్డికి మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి హామీపై జల్పల్లి వాసులు హర్షం వ్యక్తంచేశారు. అభివృద్ధి అంటే సబితమ్మ సబితమ్మ అంటే అభివృద్ధిని నినాదాలు అంటూ ఈ సందర్బంగా వారు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛ్ఛార్జ్ వాసుతోపాటు,  జల్పల్లి మాజీ సర్పంచ్ భద్రమ్మ ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్ పెంటమ్మ , కాంతా, యువకులు ,మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: