పుట్టపాక ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా,,,
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
(జానో జాగో వెబ్ న్యూస్-పుట్టపాక ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పరిధిలోని పుట్టపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం(1988.89) వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వ విద్యార్థి గ్రామ సర్పంచ్ సామల భాస్కర్ .. కోడి చంద్రశేఖర్.. గజం వెంకటేశ్వర్ల నేతృత్వంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నాటి ఉపాధ్యాయులు... సహాధ్యాయులైన విద్యార్థినీ- విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం ప్రార్థన గీతంతో ప్రారంభమైన సమావేశం చిన్ననాటి తరగతి గదుల్లో చేసిన అల్లరి పనులను .. ఆటపాటలు పరీక్షల్లో మార్కులు సాధించే సాధించేందుకు పడిన తాపత్రయం.. ఉపాధ్యాయులు దండనలను ఈ సందర్భంగా విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ప్రధానంగా మూడు దశాబ్దాల క్రితం సామాజిక శాస్త్రాలను బోధించిన మాస్టర్ లింగారెడ్డి టీచర్.. సైన్స్ విజ్ఞాన శాస్త్రాలను బోధించిన రంగారెడ్డి లు... గణిత శాస్త్రాన్ని బోధించిన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, దానయ్య లు నాడు తరగతులు నిర్వహించటానికి పడిన అష్ట కష్టాలను గుర్తు చేసుకున్నారు.
పాఠశాల అప్డేషన్ కోసం చేసిన కృషిని వివరించారు. నాటి తెలుగు పండితులు సాగర్ రావు గారు పూజ్యమైన కవితను పద్యాలను విశ్లేషిస్తూ మార్గ నిర్దేశం చేశారు. మధ్యాహ్నం షడ్రుసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సమావేశమై విద్యార్థులు వారి కుటుంబాలను సమ్మేళనానికి పరిచయం చేశారు. పాఠశాల విద్యతో నేర్చుకున్న విజ్ఞానంతో సమాజంలో ప్రస్తుతం తాము పోషిస్తున్న బాధ్యతలను వివరించారు. సమాజ సేవ వర్తక వాణిజ్య రంగాలలో ఆయా కుటుంబాలు చేస్తున్న సేవలను వారి పిల్లల విద్య అభివృద్ధి అంశాలను పరస్పరం పరిచయం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ పూర్వ విద్యార్థి సామల భాస్కర్ దంపతులు పూర్వ విద్యార్థులందరి నీ శాలువాతో సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు.
సుమారు మూడున్నర దశాబ్దాలు అనంతరం కలుసుకోవడం అపూర్వ కలయికగా పరస్పరం విద్యార్థి నులు ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు... ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వరకాల యాదగిరి ప్రమీల (పూర్వ విద్యార్థిని) దంపతులకు.. శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. కుటుంబ సభ్యులతో తరలివచ్చిన పూర్వ విద్యార్థులందరి నీ అభినందించి సన్మానం చేశారు.ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు వయోభారంతో ఉన్నప్పటికీ విద్యార్థుల కోరిక మేరకు బ్లాక్ బోర్డ్ పై అద్భుతమైన చిత్రాలను గీసి సమ్మేళనలో పాల్గొన్న వారందరినీ ఉత్సాహపరిచారు.
Home
Unlabelled
పుట్టపాక ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా,,, పూర్వ విద్యార్థుల సమ్మేళనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: