క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించిన... 

అడిషనల్ డీఎంహెచ్ఓ బాలాజీ, ప్రభుత్వ వైద్యాధికారిని జబిన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలంలో క్షయ వ్యాధిగ్రస్తులకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఉచితంగా అందించిన ఒక కేజీ బుడ్డలు,శనగలు, కందిబేళ్లు,బెల్లం,ఆయిల్ ప్యాకెట్లను, అలసందలు వంటి పౌష్టిక ఆహార పదార్థాలను అడిషనల్ డీఎంహెచ్వో బాలాజీ, గడివేముల మండల ప్రభుత్వ వైద్యాధికారిని జబీన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్ఓ బాలాజీ, ప్రభుత్వ వైద్య అధికారిని జబీన్ మాట్లాడుతూ క్షయవ్యాధి అనేది మైకో బ్యాక్టీరియా ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని,


ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు గాలిలో విడుదలయ్యే తుంపర్ల వల్ల వచ్చే అంటువ్యాధని, క్షయవ్యాధి ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని,బరువు తగ్గడం,నిరంతరం దగ్గు రావడం,రాత్రి సమయంలో చెమట పట్టడం,విపరీత జ్వరం రావడం వంటి లక్షణాలు కలిగి ఉన్న వారు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి పరీక్ష చేయించుకోని,పేరు నమోదు చేయించుకోవాలని, అలాంటి వారికి 6 నెలల పాటు ఉచితంగా ఒక కేజీ కందిపప్పు, బెల్లం, వేరుశనగకాయలు,ఆయిల్ ప్యాకెట్,30 కోడిగుడ్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ, ఎయిడ్స్,కుష్టు,క్షయ వ్యాధి అధికారి డాక్టర్ బాలాజీ ప్రభుత్వ వైద్యాధికారిని జబీన్,ల్యాబ్ టెక్నీషియన్స్,ఆశా వర్కర్లు, వైద్యశాల సిబ్బంది,క్షయ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: