శంకర్ పల్లి మార్కెట్ నూతన  కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి

హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

శంకర్ పల్లి మార్కెట్ నూతన  కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతన చైర్మన్ గా పాపారావు, వైస్ చైర్మన్ గా వెంకటేష్, డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బిడిఎల్ చౌరస్తా నుండి ఎడ్ల బండ్లు,ట్రాక్టర్ల తో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బండి ర్యాలీలో పాల్గొని నూతన పాలకవర్గానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాందవునిగా, రైతు పక్ష పాతిగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు.


తెలంగాణ రైతు రాజ్యాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో శంకర్ పల్లి రూపురేఖలు మారిపోయాయన్నారు. రానున్న రోజుల్లో నగరం ఇక్కడ వరకు విస్తరించబోతుందని, మహర్దశ రాబోతుందన్నారు. రైతు బంధు ప్రారంభం అయినప్పటినుండి చేవెళ్ల నియోజకవర్గములో 855 కోట్లు రైతుల ఖాతాల్లో వేయటం జరిగిందని, రైతు భీమా 53 కోట్ల 20 లక్షలు అందించటం జరిగిందన్నారు. రైతుల పక్షాన ఢిల్లీలో పోరాడిన మహా నాయకులు కేసీఆర్ని మంత్రి పేర్కొన్నారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్టాల్లో చేపడతామని ఇటీవల మన రాష్టానికి వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులు పేర్కొన్నారని మంత్రి గుర్తు చేసారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి వలె పిలిస్తే పలికే నాయకునిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎదిగారని మంత్రి ప్రశంసించారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: