అంబేద్కర్ ను అవమానపరిచిన రాయలసీమ యూనివర్సిటీ సూపరిండెంట్ ఎండి ఇస్మాయిల్ ను కఠినంగా శిక్షించాలి

 బీఎస్పీ,....సిపిఐ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్టుకూరు స్థానిక పట్టణంలోఅంబేద్కర్ ను అవమానపరిచిన ఎండి ఇస్మాయిల్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు లాజరు, స్వాములు సిపిఐ పార్టీ నాయకులు రమేష్ బాబు,రఘురాంమూర్తి డిమాండ్ చేశారు. నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు బహుజన సమాజ్ పార్టీ  తాలూకా ఇంచార్జి స్వాములు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతమైన హోదాలో ఉండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను మద్యం మత్తులో తన తోటి విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుతో సాక్షాత్తు అంబేద్కర్ ను దళితులను నీచాతి నీచంగా మాట్లాడి యావత్ అంబేద్కర్ వాదులను కించపరిచిన ఎండి ఇస్మాయిల్, శ్రీనివాసరావును తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి ,


అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని,అంబేద్కర్ రాజ్యాంగం ఒక దళితులకు మాత్రమే రాయలేదని అందరికీ సమానంగా రాజ్యాంగ ఫలాలను అందే విధంగా రాజ్యాంగాన్ని మలిచారని వారు గుర్తు చేశారు మేధావులు   తయారయ్యే విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే, ప్రొఫెసర్లు,అధికారులు ఉండరాదని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు జరగకుండా వీరిని తక్షణమే దేశ బహిష్కరణ చేయాలని హెచ్చరించారు. 
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు ప్రసాద్, పుల్లయ్య,చిన్నరత్నం, దావీదు, జాన్, రగడ, రాజేష్,శ్రీను,నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: