వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను అందించిన ప్రధానికి ధన్యవాదాలు
బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
ఇంతటి అత్యద్బుత సౌకర్యాల రైలు తెలుగు ప్రజలకు ఇవ్వడం ఎంతో సంతోషం
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును సందర్శించిన బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొంది ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను తెలుగు ప్రజలకు కేంద్రం ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అందించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ప్రత్యేక ధనవ్యాదాలు తెలిపారు. ఇదిలావుంటే ఆదివారంనాడు బుక్క వేణుగోపాల్ సికింద్రాబాద్ -విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్న భారతదేశపు 8వ వందేభారత్ ఎక్సప్రెస్ ను సికింద్రాబాద్ వద్ద సందర్శించారు.
రైలు కోచ్ లోని సౌకర్యాలను ప్రత్యేకంగా వెళ్లి పరిశీలించారు. రైలులోని సౌకర్యాలను చూసిన బుక్క వేణుగోపాల్ హర్షంవ్యక్తంచేశారు. ఇంతటి అత్యద్భుతంగా తీర్చిదిద్దిన వందే భారత్ ఎక్సప్రెస్ తెలుగు ప్రజలకు వరమని బుక్క వేణుగోపాల్ ఈ సందర్భంగా కొనియాడారు.
Home
Unlabelled
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను అందించిన ప్రధానికి ధన్యవాదాలు,,,, బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్--వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును సందర్శించిన బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: