అవ్వ తాతల,అక్క చెల్లెమ్మల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నందు ఎంపీడీవో విజయసింహారెడ్డి అధ్యక్షతన పెన్షన్ వారోత్సవాల్లో భాగంగా గడివేముల మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్ పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని గడివేముల గ్రామంలో నూతనంగా మంజూరైన 173 మంది పింఛన్ లబ్బిదారులకు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా పాణ్యం నియోజవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గడివేముల మండలం లో 5715 మంది నూతన పింఛన్లు మంజూరు అయ్యాయని, పాదయాత్రలో ఇచ్చిన మాట,ఎన్నికల మేనిఫెస్టో లోని హామీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలుచేసి మాట నిలబెట్టుకున్నారని, నవరత్నాల్లో ప్రతి పథకాన్ని అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని,గ్రామ వార్డు సచివాలయాలను స్థాపించి ప్రజలకు పరిపాలన మరింత  చేరువ చేశారని,గత ప్రభుత్వంలో నూతనంగా పెన్షన్ మంజూరు అవ్వాలంటే జన్మభూమి కమిటీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు చెప్పిన వారికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేసే వారిని

,జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల,మత,ప్రాంత,పార్టీ బేధాలు లేకుండా ఎవ్వరి ప్రమేయం లేకుండా నేరుగా పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని,రాష్ట్ర వ్యాప్తంగా 64.06 లక్షల మందికి నూతనంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1765 కోట్ల రూపాయల అందివ్వడం జరిగిందని,పాణ్యం నియోజకవర్గంలో లోని లబ్ధిదారులందరికీ మంజూరైన పెన్షన్లను నేరుగా వాలంటీర్ల ద్వారా ఒకటో తేదిన వారి ఇంటి తలుపు తట్టి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గడివేముల జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీపీ నాగ మద్దమ్మ,ఎమ్మార్వో శ్రీనివాసులు ఈవో ఆర్ డి ఖాలిక్ బాషా,సింగల్ విండో అధ్యక్షులు శేఖర్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి,అమర్నాథ్ రెడ్డి, గడివేముల మండల గ్రామాల సర్పంచ్లు, వైఎస్ఆర్సిపి ముఖ్యనాయకులు, ఎంపీటీసీలు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,నూతనంగా మంజూరైన పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: