జనవరి 2023

 పాణ్యం మోడల్ స్కూల్లో... విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ ఎక్కడ

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నేతల ప్రశ్న

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం మండల  పరిధిలోని సుగాలిమెట్ట వద్దనున్న మోడల్ స్కూల్లో  రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్,(అర్ఎస్ఎ) రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్)నేతలు విద్యార్ధిని,విద్యార్ధులతో ముఖాముకి సమావేశం నిర్వహించారు.సమావేశంలో విద్యార్థిని,విద్యార్ధులు పలురకాల సమష్యలు దృష్ఠికి తెచ్చారని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్ , రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్(అర్ఎస్ఎ) జిల్లా అధ్యక్షుడు వెంకట్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్ లు తెలిపారు.ఈ సందర్బంగా రాయలసీమరవీంద్రనాధ్, వెంకట్, రియాజ్ మాట్లాడుతూ పాణ్యం మోడల్ స్కూల్లో విద్యార్ధులకు సక్రమంగా మెనూ అందిచడం లేదని, బోజనం సరిగ్గా లేదని, హాస్టల్లో విద్యార్ధుల సంఖ్య రెండ్లు రెట్లు వ్రాసుకొని వార్డెను, ప్రిన్సిపాల్ బిల్లులు స్వాహా చేస్తున్నారని, విద్యార్థినిలను హాస్టల్ వార్డెన్ సరిగా పట్టించుకోవడం లేదని, హాస్టల్ వార్డెన్ విద్యార్ధినిల సంరక్షణ మరచి ఎప్పుడూ సెల్ ఫోన్ లో మాట్లాడటం, వాట్సాప్ చూడటం చేస్తుంటుందని,ప్రిన్సిపల్ విద్యార్ధినిలతో అసభ్యకరంగా మాట్లాడుతూ,


వేధింపులకు గురి చేస్తున్నాడని,పిన్సిపల్ అటెండెన్స్ వేసుకొని స్కూలు బయట తిరుగుతుంటాడని  విద్యార్ధిని,విద్యార్ధులు నేతలకు చెప్పి వ్రాతపూర్వకంగా వ్రాసి ఇచ్చిన కాగితాలను 
రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్, రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్,రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) పాణ్యం కార్యకర్త బాలకృష్ణ నాయక్ తదితరులు నంద్యాలలోని నంద్యాల జిల్లా విద్యాశాఖాథికారిని అనురాధ గారిని డీఈఓ కార్యాలయంలో కలిసి పాణ్యం మోడల్ స్కూల్లో విద్యార్థినీ,విద్యార్ధులు సమష్యలతో వ్రాసి ఇచ్చిన పేపర్లను అందజేస్తూ పాణ్యం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్,హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లను తక్షణమే సస్పెండ్ చేసి, విద్యార్ధుల సమష్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

హిజాబ్ ఆమె హక్కు 
ఫిబ్రవరి 1న వరల్డ్ హిజాబ్ డే

ఓ హిజాబ్ ధరించిన యువతి ఫ్రాన్స్ సూపర్ మార్కెట్ కి వెళ్లింది. తమకు కావాల్సిన సరుకులన్నీ ట్రాలీలో వేసుకుని డబ్బులు చెల్లించడానికి క్యాష్  కౌంటర్ దగ్గరకు వెళ్లింది. కౌంటర్లో క్యాషియర్ గా ఉన్న అరబ్బు యువతి హిజాబ్ ధరించిన ఆమెను చూసి అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ దేశంలో హిజాబ్, నఖాబ్ నడవదు. ఫ్రాన్స్ లో బురఖా గిరఖా నైజాన్తా’ అన్నది. హిజాబ్ దరించిన యువతి ముఖానికి కప్పుకున్న ముసుగును తొలగించగానే.. క్యాష్ కౌంటర్లో ఉన్న అరబ్ యువతి ఒక్కసారిగా ఖంగుతిన్నది. ఆమె మరే ముస్లిమ్ కంట్రీ నుంచి వచ్చినామె కాదు. అక్కడి ఫ్రాన్స్ పౌరురాలు. క్యాష్ కౌంటర్లో కూర్చున్న అరబ్బు యువతితో ‘నేను ఇస్లామ్ ధర్మాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాను. మా తాత ముత్తాతలది ఇక్కడే. నేను అచ్చమైన ఫ్రాన్స్ పౌరురాలిని. నేనిక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. నువ్వే బయటి దేశం నుంచి వచ్చావ్! మీరు మీ విశ్వాసాలను అమ్ముకున్నారు. మేము కొనుకున్నాం’ అని చెప్పిన మాటలకు అరబ్బు యువతి చెంప చెళ్లుమనిపించినట్లయింది. 

నోబుల్ బహుమతి గ్రహీత తవక్కుల్ కర్మాన్, యమన్ లో విప్లవానికి తల్లి వంటి వారు. ఆమెను పాశ్చాత్య జర్నలిస్టులు హిజాబ్ గురించి ప్రశ్నిస్తు, హిజాబ్ ఆమె తెలివితేటలకు, విద్యాజ్ఞానాలకు పొంతన లేనిదిగా కనబడుతుందని అన్నారు. ఆమె జవాబిస్తూ “మనిషి చరిత్ర ప్రారంభంలో దాదాపు నగ్నంగా ఉండేవాడు. తెలివితేటలు పెరిగి, జ్ఞానం పెంపొందిన తర్వాత దుస్తులు ధరించడం మొదలు పెట్టాడు. నేను నేడు ఎలా ఉన్నానన్నది? ఏమి ధరిస్తున్నానన్నది మనిషి సాధించిన నాగరికత, ఆలోచనల ఔన్నత్యానికి నిదర్శనం. ఇది వెనుకబాటు కాదు. దుస్తులను వదిలేయడమే అనాగరిక కాలానికి తిరిగి పోవడం వంటిది” అన్నారు. "నేను ఇస్లాం మతంలోని పరదా వ్యవస్థ ద్వారా ప్రభావితమైన తర్వాతనే ఇస్లాంను స్వీకరించాను.ఇది స్త్రీ గౌరవాన్నిపెంచుతుంది. ఆమెస్త్రీత్వాన్నికాపాడుతుంది. ఇప్పుడు నాకు పరదా రక్షణకవచం”

- కమలాసూరయ్య (గతంలోకమలాదాస్) ఒక ప్రసిద్ధ మలయాళ రచయిత్రి. 

"పశ్చిమ దేశాలలో చాలా మంది ముస్లిం మహిళలు తమ గుర్తింపులో భాగంగా హిజాబ్‌ను ధరించాలని ఎంచుకున్నారు. ఇది ఛాందసవాదం కానే కాదు.  

- ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ రాచెల్వుడ్‌లాక్ 


హిజాబ్ అంటే ఏమిటి? అరబీలో “హజబ” అన్న మూలపదం నుంచి హిజాబ్ వచ్చింది. ఈ పదానికి అర్ధం దాచి పెట్టడం, లేదా " కప్పి పెట్టడం అని అర్ధం. ఇస్లామీయ పరిభాషలో యుక్తవయస్సుకు చేరుకున్న తర్వాతి నుంచి ముస్లిమ్ మహిళ ధరించవలసిన వస్త్రధారణ నియమాన్ని హిజాబ్ గా పిలుస్తారు. హిజాబ్ అంటే పూర్తి దేహాన్ని, ముఖం చేతులు తప్ప మిగిలిన శరీరాన్ని కప్పి ఉంచడం. కొందరు తమ ముఖాన్ని, చేతులను కూడా కప్పుకుంటారు. దీన్ని బురఖా లేదా నికాబ్ అంటారు. అందరు మహిళలు ఉన్నప్పుడు, సమీప మగబంధువులు మాత్రమే ఉన్నప్పుడు హిజాబ్ అవసరం లేదు. నిజానికి హిజాబ్ అనేది కేవలం బాహ్య వస్త్రధారణకు సంబంధించినది మాత్రమే కాదు. లజ్జ, మాట్లాడే పద్ధతి, హుందాతనాలకు సంబంధించినది. ఇవి పురుషులు కూడా పాటించవలసినవే.

హిజాబ్ అంటే దైవవిధేయత 

హిజాబ్ వల్ల అనేక లాభాలున్నప్పటికి, ముఖ్యంగా దైవాదేశాలను అనుసరించడానికి హిజాబ్ ధరిస్తారు. ఇది దైవవిధేయతకు చిహ్నం. ఇది ధార్మిక విశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది. దివ్యఖుర్ఆన్ ఈ విషయమై ఏమందంటే : ‘‘విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు.’’

(దివ్యఖుర్ఆన్ : 33 : 59)

లజ్జకు నిదర్శనం 

ఇస్లామ్ సిగ్గు లజ్జలను ప్రోత్సహిస్తుంది. సమాజంలో అనైతికతను అదుపు చేస్తుంది. ఈ లక్ష్యసాధనలో హిజాబ్ కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

అనవసరంగా ఒకరినొకరు తదేకంగా చూసుకోవడం అనే రుగ్మత ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులలో ఉంది. పైగా దీన్ని పెద్ద తప్పుగా కూడా భావించడం లేదు. సామాజిక పతనానికి ఇది మొదటిమెట్టుగా ఇస్లాం భావిస్తుంది.

ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండి అని చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దానిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవలదని దానంతట అదే కనిపించేది తప్ప- తమ వక్షస్థలాలను ఓణీ అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని. (దివ్యఖుర్ ఆన్: 24:30-31)

పైన పేర్కొన్న దివ్యఖుర్ ఆన్ వాక్యాల్లో ముందుగా పురుషులను ఉద్దేశించి చూపులను క్రిందికి వాల్చుకొమ్మని చెప్పడం జరిగింది. తమ సిగ్గులజ్జలను కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. 

హిజాబ్ రక్షణ కవచం..

హిజాబ్ వెనుక ముఖ్యమైన ఉద్దేశ్యం లైంగిక ఆకర్షణను తగ్గించడం ద్వారా సమాజంలో నైతిక పతనాన్ని అడ్డుకోవడం. హిజాబ్ అనేక విధాలుగా సముదాయాల్లో, కుటుంబాల్లో స్థిరత్వాన్ని సాధించడం ద్వారా స్త్రీలను, పురుషులను, సమాజాన్ని కాపాడుతుంది. 

- కామదృష్టి నుంచి, వికృత పోకడల నుంచి స్త్రీలకు రక్షణనిస్తుంది. 

- ఆకర్షణ కారణంగా స్త్రీల పై జరిగే మోసాలను తగ్గిస్తుంది. 

- వాంఛలు, నష్టదాయకమైన కోరికల నుంచి రక్షణ ఇస్తుంది.

- మహిళల స్త్రీత్వాన్ని ప్రోత్సహిస్తుంది. 

-హిజాబ్ స్త్రీత్వాన్ని అణిచివేయదు. 

- స్త్రీలకు హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తుంది. 

- బాహ్య ఆకారాన్ని బట్టి కాక ఒక వ్యక్తిగా వారికి గుర్తింపు నిస్తుంది. 

హిజాబ్ హుందాతనానికి నిదర్శనం 

హిజాబ్ అంటే గౌరవం 

నేడు అనేక సముదాయాల్లో మహిళలకు చిన్నప్పటి నుంచి వారు ఎంత అందంగా ఉన్నారో అంత విలువైన వారన్న భావం కలిగిస్తున్నారు. అందువల్ల మహిళలు తప్పనిసరిగా అహేతుకమైన, అసంబద్దమైన సౌందర్య ప్రమాణాలను అనుసరించక తప్పడం లేదు. ఆ విధంగా సమాజంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల అభిలాషలకు అనుగుణంగా మారడానికి శ్రమిస్తున్నారు. ఇలాంటి కృత్రిమమైన వాతావరణంలో, బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు వ్యక్తి అంతర్గత సౌందర్యం గురించి పట్టించుకోవడమే లేదు. కాని ఇస్లామ్ మాత్రం అంతర్గత సద్గుణాలు, వ్యక్తిత్వం, సదాచరణల ఆధారంగానే వ్యక్తికి విలువ లభస్తుందని బోధిస్తుంది. పుట్టుకతో లభించే అందం, రూపాల ఆధారంగా విలువ ఉండదని స్పష్టం చేస్తుంది. ఇస్లామీయ సమాజంలో స్త్రీ గుర్తింపు పొందడానికి తన ఆందచందాలను ప్రదర్శించవలసిన అవసరం లేదు. హిజాబ్ వల్ల బాహ్య రూపానికన్నా అంతర్గత గుణగణాలకే ఎక్కువ ప్రాముఖ్యం లభిస్తుంది. సద్గుణాలు, లజ్జ, తెలివితేటలు వంటి గుణగణాలు హిజాబ్ వల్ల గుర్తింపుకు ముఖ్య సాధనాలవుతాయి.

 హిజాబ్ ఆత్మవిశ్వాసం

 హిజాబ్ వల్ల స్త్రీలలో ఒక వ్యక్తిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీని వల్ల  సాధికారత, స్త్రీ ఆత్మగౌరవం పెరుగుతుంది.

జీవితంలో ఏది ముఖ్యమో ఆలోచించే   వాతావరణం ఏర్పడుతుంది. బాహ్య సౌందర్యం పట్ల తీవ్రమైన వ్యామోహం

వల్ల ప్రమాదకరమైన, అనారోగ్యకరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కొందరు మహిళలు అందంగా కనిపించేందుకు ప్రమాదకరమైన పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. హిజాబ్ వల్ల అలాంటి మానసిక, శారీరక నష్టాలను నివారించవచ్చు. 

హిజాబ్

• సామాజిక కార్యకలాపాల్లో అడ్డంకి కాదు 

• అణిచివేతకు నిదర్శనం కాదు. 

• కేవలం స్త్రీలు, సమీప పురుష బంధువులున్న చోట హిజాబ్

అవసరం లేదు. 

• పురుషులకన్నా స్త్రీలు తక్కువ అనడానికి చిహ్నం కాదు. 

• స్త్రీ తన భావాలు ఆలోచనలు ప్రకటించడానికి అడ్డంకి కాదు. 

• విద్యాజ్ఞానాలు పొందడానికి, కెరీర్ లో ఎదగడానికి అడ్డంకి కాదు. 

• ఇది మొబైల్ జైలు కాదు ఇది ముస్లిమేతరులపట్ల ప్రతిఘటన, వ్యతిరేకత, సవాలు వంటిది కాదు.


రచయిత- ఆయిషా సుల్తానా

హైదరాబాద్,  98669 19779


 నందమూరి తారకరత్న ఆరోగ్యంగా తిరిగి రావాలని

బీజేపీ  నేత  బుక్క క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

సినీ హీరో నందమూరి తారకరత్న ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహక సభ్యులు బుక్క క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్తమి త్రులైన "నందమూరి తారక రత్న"కు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యానికి తోడుగా అభయ ఆంజనేయ స్వామివారి రక్షణతో త్వరాగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఈ సందర్భంగా బుక్క క్రిష్ణ కోరుకొన్నారు. నందమూరి తారకరత్న అందరి మధ్యలో చిరునవ్వుతో తిరగాలని "అమ్మపల్లి అభయ ఆంజనేయ స్వామివారికి బుక్క క్రిష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కనకమామిడి విష్ణు ముదిరాజ్, కనకమామిడి కిట్టు ముదిరాజ్, బురుకుంట నాగేష్, భాస్కర్, వరప్రసాద్, తేజ, బుక్క క్రిష్ణ మిత్ర బృందం పాల్గొన్నారు.  రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి,,,

హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి బీజేపీ ముఖ్యనేతలతో కలసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. మంగళవారంనాడు కుంట్ల రామ్ రెడ్డి గార్డెన్స్ లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జెండా ఆవిష్కరణతోపాటు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. వీటిలో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అథితిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ హాజరయ్యారు.


వీరితోపాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా, ప్రేమ్ రాజ్, బిజెపి రూరల్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా అంజన్ గౌడ్, తూళ్ల వీరేందర్ గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీరాములు యాదవ్, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, లచ్చి రెడ్డి, కొత్త అశోక్ గౌడ్, అందే బాబాయ్య, జంగయ్య యాదవ్, బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నందాకిశోర్ గుప్తా, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, పాశం శ్రీధర్, బుక్క ప్రవీణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా పదాధికారులు, జిల్లా నాయకులు, రాజేంద్రనగర్ నియోజకవర్గ వివిధ మండల అధ్యక్షులు,  బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.


 ఈ సార్లు అంతా వెరీ బీజీ

మహాత్ముని వర్ధంతిని విస్మరించిన అధికార్లు

నివాళ్లులు నోచుకొని గాంధీజీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

మహాత్మాగాంధీ ఈ పేరు మన దేశంలోని కాదు దేశ, విదేశాలలో సైతం ఎంతోో సుపరిచితం. అంతే కాదు విదేశీయులచేత కూడా పూజింపబడుతున్న మహోన్నతుడు మన మహాత్మాగాంధీ. ఇక మనదేశానికి జాతిపిత ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి...వర్ధంతి రెండూ ఎంతో భక్తితో ప్రతి భారతీయుడు నిర్వహిస్తాడు. కానీ అందుకు భిన్నమైన వాతావరణం మన నంద్యాల జిల్లా గడివేముల మండలంలో నెలకొంది. అక్కడి ప్రభుత్వ అధికార్లు అంతా పనుల్లో బీజీ అయ్యారటా...అందుకే అక్కడ తన వర్ధంతి సందర్బంగా మహాత్మాగాంధీ కనీసంనివాళిని కూడా నోచుకోలేదు. ఆయన విగ్రహానికి గానీ చిత్రపటానికి గానీ ఓ పూలమాల వేయలేదు. ఇది మన గడివేముల మండలంలోని అధికార్ల తీరు. ఈ సార్ల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అహింసా ఉద్యమంతో అందరి మనస్సులను చూరగొని బ్రిటీషర్లను వణికించిన ధీరుడు మహాత్మాగాంధీ. అలాంటి గాంధీకి  ఆయన వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ అధికార్లు కనీసం నివాళ్లులర్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


గడివేముల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్, సచివాలయాలలో గ్రామపంచాయతీ కార్యాలయాలలో జాతిపిత మహాత్మాగాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి గాని చిత్రపటానికి పూలమాల వేసి ఘటన ఎక్కడ  చోటు చేసుకోలేదు.  ఏ కార్యాలయంలోనూ గాంధీ వర్ధంతి కార్యక్రమం  జరిగినట్లు తెలియరాలేదు. కారణం వింటే వింతగా ఉంది. మండల పరిధిలో స్పందన కార్యక్రమం ఉన్నందున కొందరు అధికార్లు తాము బీజీ అని భావించారు. ఇంకోందరు ఏ కారణంతో చేయలేదో గానీ మొత్తంగా మహాత్మాగాంధీ వర్ధంతిని విస్మరించి అధికార్లు విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు. 


 సద్భావన స్ఫూర్తిని కాపాడుకోవడం కోసమే! 

- ధార్మిక జనమోర్చా స్టేట్ కన్వీనర్ జనాబ్ సాదిక్ అహ్మద్

భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేసే కుట్రలు ఇటీవలె కాలంలో పెచ్చరిల్లుతున్నాయి. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ధోరణి దేశ సమగ్రతకు ప్రమాదకరం. సమాజంలో శాంతి, సౌఖ్యం, సద్భావనతోనే మన దేశం పురోగతిలో ప్రయాణిస్తుంది! దేశ అభివృద్ధిని, మన విశిష్టతను ధ్వంసం చేసే విభజన రాజాకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి. ఈ విషయంలో రచయితలు, కవులు, జర్నలిస్టులు, ధార్మిక పండితులు ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ విషయాన్ని గుర్తించిన  ధార్మిక జనమోర్చా తెలంగాణ శాఖ సద్భావన సదస్సులు నిర్వహిస్తోంది! మోర్చా తెలంగాణ స్టేట్ కన్వీనర్ సాదిక్ అహ్మద్ ఆ పనుల్లోనే తీరికలేకుండా ఉంటారు. 

మత గురువులతో సమావేశాలు...

ధార్మిక జనమోర్చా వేదిక ద్వారా విభిన్న మత గురువులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరి మతాలను వారు ఆచరిస్తూనే ఎదుటి వారి మతాన్ని గౌరవించాలన్న సందేశాన్ని మత పెద్దలతో చెప్పించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ఒకరి మత సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమావేశాల్లో ధార్మిక జనమోర్చా వేదిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు అన్య మతాల పండితులు అభినందిస్తున్నారు. హైందవ మత గురువు చిన జీయర్ స్వామి సైతం ధార్మిక జన మోర్చా సేవలను కొనియాడారు. క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత గురువులు సైతం ధార్మిక జనమోర్చా వేదికను పంచుకున్నారు.


సత్ఫలితాలను ఇస్తున్న కవి సమ్మేళనాలు..

ధార్మిక జన మోర్చా ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తున్న కవి సమ్మేళనాలను తెలుగు రాష్ట్రాల సాహితీ పెద్దలు మెచ్చుకుంటున్నారు. శ్రీ కొలకలూరి ఇనాక్, శ్రీ నాళేశ్వరం శంకరం, శ్రీ గౌరీ శంకర్, తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి తదితర సాహితీ పెద్దల పర్యవేక్షణలో జరిగిన కవి సమ్మేళనాలు విజయవంతమయ్యాయి. పంద్రాగస్టు, ఛబ్బీస్ జనవరిని పురస్కరించుకుని జరిగిన ఈ సమ్మేళనాల్లో వందల సంఖ్యలో కవులు సద్భావన ప్రాముఖ్యతను తమ కవితల ద్వారా నొక్కిచెప్పారు. కులమతాలకతీతంగా కవులందరినీ ఒకచోట సమావేశపర్చడం నిజంగా అభినందనీయమే! ‘సద్భావన స్ఫూర్తిని కాపాడుకుంటేనే భారత దేశం అభివృద్ధి పథంలో ముందుకెళుతుంది. ధార్మిక జనమోర్చా ప్రయత్నాలన్నీ ఆ స్ఫూర్తిని కాపాడుకోవడం కోసమే!’ అంటారు సంస్థ స్టేట్ కన్వీనర్ జనాబ్ సాదిక్ అహ్మద్.

- ముహమ్మద్ ముజాహిద్ 96406 22076

 నిరుద్యోగ యువతీ యువకులకు ఆశాదీపం సెట్విన్

చార్మినార్ శాసనసభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ఆశాదీపంగా నిలుస్తోందని చార్మినార్ శాసనసభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. సెట్విన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.  సోమవారం సెట్విన్ మోతి గల్లి శిక్షణ కేంద్రంలో వివిధ వృత్తి విద్యా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ యువకులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణుగోపాలరావు ఆధ్వర్యంలో స్థానిక చౌహల్లా ప్యాలెస్ ఆవరణలో ఉన్న ఉర్దూ మస్తాన్ లో జరిగింది. సర్టిఫికెట్లను ప్రధానం చేసిన అనంతరం ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ  నిరుద్యోగులకు సెట్విన్  లో అందిస్తున్న ఉపాధి మృతి విద్యా కోర్సులు యువతకు మేలు చేస్తున్నాయని ముఖ్యంగా స్వయం ఉపాధిలో ఆ సంస్థ నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో మంచి అవకాశం కల్పిస్తుందని అన్నారు.


సెట్విన్ సంస్థ అందిస్తున్న వివిధ ఉపాధి కోర్సులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు. సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు మాట్లాడుతూ సేట్విన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని,  శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా జాబ్ మేళాల ద్వారా తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా  వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ పొందిన వారికి మెరిట్ ప్రాతిపదికన జ్ఞాపికలను, సర్టిఫికెట్లను బహుకరించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎకౌంట్స్ ఆఫీసర్, పీ. ఓం ప్రకాష్ , మేనేజర్ ఏం ఏ. Moiz, సూపరింటెంట్ పిబిఎస్ ప్రసాద్, మోతిగల్లి శిక్షణా కేంద్రం ఇంచార్జ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  అంతకుముందు సంస్థ ద్వారా అందిస్తున్న కోర్సులను నిర్వహిస్తున్న కార్యకలాపాలను మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు  వివరించారు.

 ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

హైదరాబాద్ నగరంలోని ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బి.సాయిశ్రీ సోమవారం నాడు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా మంత్రికి డీసీపీ బి.సాయి శ్రీ పూలకుండి అందజేశారు. ఎల్ బి నగర్ నూతన డీసీపీగా నియమితులైన సందర్బంగా బి.సాయి శ్రీని మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

 పుట్టపాక ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా,,,

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

(జానో జాగో వెబ్ న్యూస్-పుట్టపాక ప్రతినిధి)

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పరిధిలోని పుట్టపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం(1988.89) వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వ విద్యార్థి గ్రామ సర్పంచ్ సామల భాస్కర్ .. కోడి చంద్రశేఖర్.. గజం వెంకటేశ్వర్ల నేతృత్వంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నాటి ఉపాధ్యాయులు... సహాధ్యాయులైన  విద్యార్థినీ- విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం ప్రార్థన గీతంతో ప్రారంభమైన సమావేశం చిన్ననాటి తరగతి గదుల్లో చేసిన అల్లరి పనులను .. ఆటపాటలు పరీక్షల్లో  మార్కులు సాధించే సాధించేందుకు పడిన తాపత్రయం.. ఉపాధ్యాయులు దండనలను ఈ సందర్భంగా విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.  ప్రధానంగా మూడు దశాబ్దాల క్రితం సామాజిక శాస్త్రాలను బోధించిన మాస్టర్ లింగారెడ్డి టీచర్.. సైన్స్ విజ్ఞాన శాస్త్రాలను బోధించిన రంగారెడ్డి లు... గణిత శాస్త్రాన్ని బోధించిన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, దానయ్య లు నాడు తరగతులు నిర్వహించటానికి పడిన అష్ట కష్టాలను గుర్తు చేసుకున్నారు.


పాఠశాల అప్డేషన్ కోసం చేసిన కృషిని వివరించారు. నాటి తెలుగు పండితులు సాగర్ రావు గారు పూజ్యమైన కవితను పద్యాలను విశ్లేషిస్తూ మార్గ నిర్దేశం చేశారు. మధ్యాహ్నం షడ్రుసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సమావేశమై విద్యార్థులు వారి కుటుంబాలను సమ్మేళనానికి పరిచయం చేశారు. పాఠశాల విద్యతో నేర్చుకున్న విజ్ఞానంతో సమాజంలో ప్రస్తుతం తాము పోషిస్తున్న బాధ్యతలను వివరించారు. సమాజ సేవ వర్తక వాణిజ్య రంగాలలో ఆయా కుటుంబాలు చేస్తున్న సేవలను వారి పిల్లల విద్య అభివృద్ధి అంశాలను పరస్పరం పరిచయం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ పూర్వ విద్యార్థి సామల భాస్కర్ దంపతులు పూర్వ విద్యార్థులందరి నీ శాలువాతో సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు.

సుమారు మూడున్నర దశాబ్దాలు అనంతరం కలుసుకోవడం అపూర్వ కలయికగా పరస్పరం విద్యార్థి నులు ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు... ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వరకాల యాదగిరి ప్రమీల (పూర్వ విద్యార్థిని) దంపతులకు.. శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.  కుటుంబ సభ్యులతో తరలివచ్చిన పూర్వ విద్యార్థులందరి నీ అభినందించి సన్మానం చేశారు.ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు వయోభారంతో ఉన్నప్పటికీ విద్యార్థుల కోరిక మేరకు బ్లాక్ బోర్డ్ పై  అద్భుతమైన చిత్రాలను గీసి సమ్మేళనలో పాల్గొన్న వారందరినీ ఉత్సాహపరిచారు.


 బేతంచెర్ల లోని బ్రహ్మారెడ్డి వైద్యశాలను తక్షణమే సీజ్ చేయాలి

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్విఎఫ్) డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని బేతంచర్ల పట్టణంలో ఉన్న బ్రహ్మారెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రమాదేవిపై తక్షణమే కేసు నమోదు చేసి హాస్పటల్ సీజ్ చేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు రాయలసీమ రవీంద్ర నాథ్, బత్తిన ప్రతాప్ మాట్లాడుతూ 73 వ గణతంత్ర దినోత్సవ సాక్షిగా న్యాయాన్ని నాలుగు దిక్కులా హత్య చేసి, అక్రమ సంపాదనకై వైద్య నిబంధనలకు వ్యతిరేకంగా నిండు గర్భిణీకి బృన హత్యలు(అబాషన్)వైద్యం వికటించి బేతంచెర్ల మండల పరిధిలోని బుక్కాపురం గ్రామానికి చెందిన మహిళ మృతికి కారణమైన బ్రహ్మారెడ్డి వైద్యశాల వైద్యురాలు రమాదేవి పై తక్షణమే కేసు నమోదు చేసి హాస్పటల్ సీజ్ చేయాలని,


స్వాతంత్ర్య భారతదేశంలో నేటికీ పౌరుల బతుకులు మారక సరైన వైద్యం అందక సామాన్య పేద మధ్య తరగతి ప్రజల దైనందిక జీవితాలతో చెలగాటం ఆడుతూ వైద్యశాలలో నియంతగా వ్యవహరిస్తూ నిండు గర్భిణీకుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని,బేతంచర్ల పట్టణంలోని కొంతమంది స్థానిక నాయకులు, ఓప్రజాప్రతినిధి గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ పంచాయతీ చేసి బాధితులకి నచ్చచెప్పి వైద్యురాలు రమాదేవికి అండదండగా నిలబడి ఎవరు వచ్చినా ఈ ఊరులో మమ్మల్ని కాదని ఎవరు రారని భరోసా ఇవ్వడం ఎంతవరకు సమంజసమనీ, ప్రజలకు న్యాయం చేయాల్సిన వారే ఇలా హంతకులకు అండగా నిలబడడం చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని,తక్షణమే మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించి మృతురాలి నలుగురు పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనీ,సంబంధిత అధికారులు స్పందించి మృతికి కారణమైన బ్రహ్మారెడ్డి వైద్యశాల వైద్యురాలు డాక్టర్ రమాదేవి పై తక్షణమే కేసు నమోదు చేసి హాస్పటల్ ని సీజ్ చేయాలని లేని పక్షంలో హాస్పిటల్ ఎదుట ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు.

 జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ప్రియాంకను,,,

అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్,ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ప్రియాంకను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. గతంలో నిర్వహించిన సన్ రైజ్ టూ సన్ రైజ్ 24 గంటల మారథాన్ లెక్చర్ తో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన సూర్యాపేట్  కు చెందిన ప్రియాంకకు తాజాగా ఈ అవార్డ్ ను అందుకున్నారు.ఈ సందర్భంగా ఆదివారం నాడు మీర్ పేట్ క్యాంప్ కార్యాలయంలో క్లినికల్  రీసెర్చ్ డేటా మేనేజ్మెంట్ పై 24 గంటలు ఏకధాటిగా లెక్చర్ ఇచ్చిన ప్రియాంక ను మంత్రి ప్రత్యేకంగా అభినందించి,సన్మానించారు. బడుగు,బలహీన వర్గాలకు అండ సిపిఐ జెండా

సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందమూరి నగర్ లో సిపిఐ పట్టణ కార్యదర్శి  ప్రసాద్ ఆధ్వర్యంలో 20 మంది ముస్లిం యువకులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లో చేరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సోమన్న, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి  శ్రీనివాసులు, శాఖ కార్యదర్శి హుస్సేన్సా పాల్గొన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ యువకులను పార్టీలోకి ఆహ్వానించి సిపిఐ కండువాలు కప్పారు.  అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా కార్మిక సమస్యలపై పోరాడే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లో యువకులు చేరడం ఎంతో ఆనందించదగ్గ విషయమని, సిపిఐ పార్టీలో చేరిన వారు పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని, ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా కార్మిక సమస్యలపై పోరాటం చేయాలని, పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని,


నందమూరి నగర్ ఏర్పడి దాదాపు 40 సంవత్సరములు అయిందని,నేటికీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, నందమూరి నగర్ లోని సమస్యలపై దశల వారి ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీం,రహిమాన్, పార్క్,జాకీర్,యూనిఫ్, ఇమాంస,సాదిక్ వలి, హుస్సేన్ భాష,హనీ భాష, యూసఫ్ ఖాన్,సలాం ఖాన్,సేక్షావలి,ఖలీల్, జాఫర్,పైరాజ్,భాష, హుస్సేన్ సా,అబ్బాస్, పారుక్ తదితరులు పాల్గొన్నారు.

 నేటి నుండి డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు

షాదానా హాస్పిటల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందిస్తాం

షాదాన్ మేనేజింగ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్   షాదాన్ వైద్య కళాశాల ఏర్పాటుచేసి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు షాదాన్ సొసైటీ నిర్వాహకులు షాదాన్ విజారత్ రసూల్ ఖాన్ తెలిపారు. జనవరి 30నుంచి ఫిబ్రవరి 15 వరకు షాదాన్ హాస్పిటల్లో జరిగే ఈ హెల్త్ క్యాంపులో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. కులమతాల పట్టింపు లేకుండా నిరుపేదలకు రోగాల నుంచి విముక్తి కల్పించి ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించడమే ఈ వైద్య శిబిరం ప్రధాన ఉద్దేశమని ఆమె చెప్పారు. షాదాన్ హాస్పిటల్ ప్రారంభమైన మొదటి ఏడాది నుంచే ఏడాదికి రెండు సార్లు ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఆమె గుర్తుచేశారు. 

షాదాన్ సొసైటీ వైస్ ఛైర్మన్ ఏజాజుర్రహ్మాన్, సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ మాట్లాడుతూ క్యాంపు చివరి రోజు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారందరికీ ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్డుల ద్వారా కుటుంబంలోని సభ్యులంతా ఏడాది పాటు ఉచిత వైద్యాన్ని పొందవచ్చని అన్నారు. ఈ 20ఏళ్ల కాలంలో 25లక్షల మందికి ఉచిత వైద్యమందించామన్నారు. ప్రతీ ఆరు నెలలకోసారి జరిగే ఈ మెగా హెల్త్ క్యాంపులో నగర ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలలతోపాటు కశ్మీర్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యాన, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ప్రజలు ఉచిత వైద్య సేవలందుకున్నారని ఆయన పేర్కొన్నారు. క్యాంపులో వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడమే కాకుండా అవసరమైన రోగులకు పలు రకాల శస్త్ర చికిత్సలు చేస్తున్నామన్నారు. ఎంతోమందికి కిడ్నీ, ఎముకల సర్జరీలు చేశామన్నారు. గర్భ సంచి ఆపరేషన్, నార్మల్, సిజీరియన్ డెలివరీలు కూడా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తున్నామన్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి క్యాలిఫైడ్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉచిత వైద్యమందిస్తున్నామని చెప్పారు. 


ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగానే..

ఫ్రీ మెగా హెల్త్ క్యాంపులో ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగానే చేస్తున్నామని, రోగులు సద్వినియోగం చేసుకోవాలని  సారిబ్ రసూల్ ఖాన్ కోరారు. అల్ట్రా సౌండ్ ఇమేజింగ్, 2డి ఎకో, రేడియాలజీ ఎమ్మారై స్కాన్ లాంటి పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. 

స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో..

యూరాలజీ (మూత్రాశయం), కార్డియాలజీ (గుండె), నెఫ్రాలజీ (కిడ్నీ), ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. 

ఉచిత రవాణా..

సిటీలోని పలు ప్రాంతాల నుంచి రోగుల రవాణా కోసం ఉచిత బస్సుసౌకర్యం ఏర్పాటు చేశామని సారిబ్ రసూల్ ఖాన్ చెప్పారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని రవాణా తదితర  వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు.

హెల్ప్ లైన్ నెంబర్లు : 9676311747, 8686285796, 9849019535, 9000988544, 9985230806, 9885751975, 9866606046, 9966112448, 7032414388


 బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ చేయాలని డిమాండ్

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకొంది. బనగానపల్లె మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ వేధింపులతో దస్తగిరి మృతి చెందారని ఆయన బంధువులు ఆందోళన చేట్టారు. దస్తగిరి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా వారు అడ్డుకున్నారు. ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ లను విధుల నుండి తప్పించి, వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపేవరకు తాము మృతదేహానికి శవ పరీక్ష చేయించమని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు భీష్మించి కూర్చున్నారు.


దీంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకొని మృతుడి దస్తగిరి కుటుంబ సభ్యులతో,బంధువులతో మాట్లాడుతూ శవపరీక్ష చేయించాలని సూచించారు. మృతుని దస్తగిరి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉండి పోరాడుతానని హామీ ఇవ్వడంతో శివ పరీక్ష పంచనామను ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్వహించారు. ఉన్నత అధికారులు చొరవ చేసుకుని ఎస్సై శంకర్ నాయక్, ఏఎస్ఐ లక్ష్మణ్ లను విధుల నుంచి తొలగించి 
సస్పెండ్ చేయకపోతే కుటుంబ సభ్యులందరం పురుగుల మందు తాగడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మృతుని బంధువులు హెచ్చరించారు. 


 గుర్రెపు డెక్కతో తయారు చేసిన  హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు

ఆకర్షితులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తయారిదార్లను అభినందించిన మంత్రి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ చందనం చెరువులో రోబెటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ద్వారా తొలగించిన గుర్రెపు డెక్కతో తయారు చేసిన  హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు చాలా బాగున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు.ఆదివారం మీర్ పేట్ క్యాంపు కార్యాలయంలో ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను తయారు చేసిన అలీప్ ప్రతినిధులు ప్రభావతి, ఆమె కుమారుడు మోహన్ రెడ్డిలు మంత్రిని కలిసి తాము తయారు చేసిన హ్యాండిక్రాఫ్స్ వస్తువులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు.


 తెలంగాణాలో బీజేపీ త్రిముఖ వ్యూహాన్ని కార్యాచరణ

మోదీతో 5 సభలు నిర్వహించేందుకు ప్లాన్

పక్కా ప్లాన్ తో తెెలంగాణలో బీజేపీ అడుగులేస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణపై ప్రత్యే దృష్టి పెట్టిన అధిష్ఠానం.. క్షేత్రస్థాయి నుంచే పని చేయటం మొదలుపెట్టింది. కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతల పర్యటనలతో.. తెలంగాణ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా.. అధికార పార్టీపై నేతలు ఎప్పటికప్పుడు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమకు కలిసొచ్చిన ఫార్ములాను తెలంగాణలోనూ ఫాలో అయ్యేందుకు సిద్ధమైంది కమల దళం. తెలంగాణలోనూ త్రిముఖ వ్యూహాన్ని ప్రదర్శించనుంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫార్ములా సక్సెస్ అయ్యి మంచి ఫలితాలు ఇవ్వటంతో.. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అప్లై చేయాలని నిశ్చయించుకుంది. ఈ వ్యూహంతో భాగంగా పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దశలవారీగా నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపే నాలుగు నుంచి ఐదు బహిరంగ సభలు నిర్వహించటమే కాకుండా వాటిని ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ నాయకత్వం. ఈ క్రమంలో నిర్వహించే ప్రతీ కార్యక్రమం 15 రోజులపాటు కొనసాగేలా ప్రణాళికలు వేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు.. సంస్థాగతంగా పోలింగ్‌ బూత్‌ కమిటీ అధ్యక్షులను, శక్తికేంద్రాల ఇంఛార్జులను నియమించనుంది. ఇదే కాకుండా.. అటు అధికార పార్టీ ఆగడాలను.. కేంద్రంపై చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా నాయకులకు సిద్ధం చేస్తోంది.

కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? ఆ నిధులన్ని ఏమయ్యాయి? కేసీఆర్ సర్కార్ఇచ్చిన హామీలేంటి? వైఫల్యాలేంటి? వంటి అంశాలను చర్చిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కార్నర్‌ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల తొలిరోజున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇంఛార్జులతో పాటు జాతీయ పార్టీ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోని ముఖ్య నేతలు, సీనియర్‌ నాయకులు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు హాజరుకానున్నారు.

ఇక రెండో దశలో ఒక్కో మండలం ఒక్కో యూనిట్‌గా ప్రజాగోస- బీజేపీ భరోసా పేరుతో బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలు సుమారు 15 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి.. ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిచనుంది బీజేపీ.


 ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించినందుకు,,,

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన జల్పల్లి గ్రామ వాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించినందుకు మంత్రి సబితా  ఇంద్రారెడ్డికి స్థానిక జల్పల్లి గ్రామ ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ జలపల్లి గ్రామ ప్రజలు ఆదివారంనాడు మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డిని జిల్లెల గూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో  కలిశారు. జల్పల్లి మున్సిపాలిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు యంజాల జనార్ధన్, యువ నాయకులు యంజాల అర్జున్, ఆధ్వర్యంలో 245 మంది ఎస్సీ వర్గానికి చెందిన  ప్రజలు మంత్రిని కలిసి వారికి ఎస్సీ కమ్యూనిటీ భవనం కొరకు కేటాయించిన స్థలాన్ని కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. 


దీంతోపాటు స్థానిక సమస్య లు గురించి కూడా మంత్రికి తెలియజేశారు. చివరి మజిలీ కొరకు  రథం ఏర్పాటు చేయాలని కూడా వారు మంత్రిని కోరారు.  ఈ విషయాలను ఒపికతో విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాటి పల్ల సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలోో జల్పల్లి మాజీ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు ,ప్రస్తుతం జల్పల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి  క్రిష్ణారెడ్డికి మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి హామీపై జల్పల్లి వాసులు హర్షం వ్యక్తంచేశారు. అభివృద్ధి అంటే సబితమ్మ సబితమ్మ అంటే అభివృద్ధిని నినాదాలు అంటూ ఈ సందర్బంగా వారు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛ్ఛార్జ్ వాసుతోపాటు,  జల్పల్లి మాజీ సర్పంచ్ భద్రమ్మ ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్ పెంటమ్మ , కాంతా, యువకులు ,మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 


 చివరి మజిలీ యాత్రకు ఉచిత వైకుంఠ రథం

వైకుంఠ రథం ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జల్పల్లి  మున్సిపాలిటీలో సేవలు అందించేందుకు అందుబాటులోకి వైకుంఠ రథం 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి  మునిసిపాలిటీ నిధులు కింద రూ.17 లక్షల వ్యయం తో కూడిన వైకుంఠ రథం అందుబాటులోకి వచ్చింది. ఈ వాహనాన్ని వాహనాన్ని  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...నిరుపేదలకు తన చివరి మజిలీ  ఘట్టం సజావుగా సాగడానికి  చివరి మజిలీ యాత్రకు  జలపల్లి మున్సిపాలిటీ సేవల్లో వైకుంఠ రథం ఉచితంగా  ప్రజలకు అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా బీన్ అహ్మద్  సాధి, కమిషనర్ వసంత, సయ్యద్ యూసుఫ్ పటేల్ మరియు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.