2023

 ప్రతి లబ్ధిదారుడు అభయహస్తం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

బహదూర్ పురా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ పులిపాటి రాజేష్ కుమార్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అభయహస్తం స్పెషల్ అధికారి సునంద, ఫలక్నుమా సర్కిల్ డిప్యూటీ సర్కిల్ లావణ్య తదితరులతో కలసి ప్రజా పాలనా కౌంటర్లను బహదూర్ పురా అసెంబ్లీ కాంగ్రెస్ కంటెస్టేడ్ అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిపాటి రాజేష్ కుమార్ సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలో భాగంగా అభయహస్తం ఫారంలను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న భారీ స్పందనతో పెరగిన రద్దీ దృశ్య అవసరం అయితే కొన్ని స్పెషల్  కౌంటర్లను పెంచాలని ఆయన అధికారులను కోరారు.


 దరఖాస్తులు అందజేసి,,పథకాలను సద్వినియోగం చేసుకోండి 

పురానాపుల్ డివిజన్ కార్పోరేటర్ సున్నం రాజమోహన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పురానాపూల్ డివిజన్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ లబ్ధిదారులకు ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తు ఫారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మజ్లీస్ నాయకులు ప్రమోద్ కుమార్ జైన్. అంజద్ ఖాద్రి, హబీబ్ ఖూరేషీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తమ డివిజన్ ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యానికి పథకాలను దరఖాస్తు చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

 ఈ నెల ఆరో తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం

బల్ధీయా అధికార్ల వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

బహదూర్ పురా నియోజకవర్గంలోని దూద్ బౌలి డివిజన్లోని కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో బల్దీయా అధికారులు రహీం, రమేష్, అరుణ తదితరుల బృందం పాల్గొని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం ఆరవ తేదీ వరకు ఉంటుందని వారు తెలిపారు. ఈ సదుపాయాన్ని కాలనీవాసులందరూ సద్వినియోగం చేసుకొని, దరఖాస్తులు తమకు అందజేయాలని వారు కోరారు.


 


 ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆరు గ్యారెంటీ పథకాలను ప్రారంభించిన పులిపాటి రాజేష్ కుమార్

(జానో జాగో వెబ్ న్యూస్-  హైద్రాబాద్ ప్రతినిధి)

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావదినోత్సవ సందర్బంగా దూద్ బౌలి డివిజన్ అధ్యక్షులు భాను చందర్ యాదవ్ ఆధ్వర్యంలో దూద్ బౌలి చౌరస్తా లో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బహదూర్పురా నియోజకవర్గం ఇంచార్జి పులిపాటి రాజేష్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి కాంగ్రెస్ తీసుకొస్తున్న ఆరు గ్యారెంటీయుల పథకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పులిపాటి రాజేష్ కుమార్ మాట్లాడుతూ...తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 2 దఫాలుగా అధికారంలో రాలేదాని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం చాల సంతోషకరం అని అన్నారు, 


కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజులలో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. తమ తమ దగ్గర్లో ఉన్న ప్రజా పాలనా కౌంటర్ లలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులూ సయెద్ షా ముజాహిద్, ఇక్బాల్, జబ్బార్, అబేద్ అలీ, జాబేర్, హరి బాబు, రాజు, సుమంత్, అథర్ కృష్ణ, సంతోష్, తదితరాలు పాల్గొన్నారు. 

 పాతబస్తీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ గిఫ్ట్ లను పంపిణీ చేసిన ఓల్డ్ సిటీ చర్చస్ కన్వీనర్ గురగల ఆనందం 

(జానో జాగో వెబ్ న్యూస్-  హైద్రాబాద్ ప్రతినిధి)

పాతబస్తీలోని వివిధ ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ సిటీ చర్చెస్ కన్వీనర్ బుర్రగల ఆనందం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎంఐఎం నాయకుడు మహమ్మద్  అనీష్. రెవరెండ్ పాస్టర్ డాక్టర్ కేజే ఉదయ్ రాయ్ భూషణ్. పాస్టర్ బెన్నీ. సాల్మన్ రాజ్. ఆర్. డేవిడ్. బుర్ర గళ్ళ కాలేజ్. దావీదు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహదూర్ పురా, చార్మినార్ నియోజక వర్గాలలో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకులను ఓల్డ్ సిటీ చర్చస్ కన్వీనర్ గురగల ఆనందం పాస్టర్ బాలరాజ్ కృష్ణ ఫర్ చర్చి మెంబర్స్ సునీత పంపిణీ చేశారు. బహదూర్ పురా నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై,,,,

మంత్రి పొన్నం ప్రభాకర్ కు పులిపాటి రాజేష్ కుమార్ మెమోరాండం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

బహదూర్ పురా నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ కంటెస్టేడ్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ మెమోరాండం అందజేశారు.  మంగళవారంనాడు గాంధీభవన్ లో హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బహుదూర్ పురా కాంగ్రెస్ కంటేస్టేడ్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన, అక్కడ పార్టీ పరంగా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలతోపాటు సమీప భవిష్యత్తులో పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించడంతోపాటు వివిధ అంశాలతో కూడిన మెమోరాండంను కూడా సమర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు పులిపాటి రాజేష్ కుమార్ శాలువ కప్పి సన్మానించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... మున్ముందు చేపట్టబోయే అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పార్టీ కంటెస్టేడ్ అభ్యర్థుల పాత్రా ఎలావుండాలో వివరించారు.  28 నుండి మొదలు కాబోతున్న 6 గ్యారంటీల ఫారం స్వీకరణ కేంద్రాల్లో అందరూ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. ఈ సమావేశం లో హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా పాల్గొన్నారు. 


 కానాను ఫెలోషిప్ వర్షిప్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో .... 

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

కానాను ఫెలోషిప్ వర్షిప్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పురాణా ఫుల్ పార్టీ గార్డెన్ లో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఓల్డ్ సిటీ చార్జెస్ కన్వీనర్ బుర్ర గళ్ళ ఆనందం ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జూలీ స్పీకర్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలను అందజేశారు. క్రీస్తు జననం గురించి పాస్టర్ ఆనందం వివరిస్తూ శాంతి సమాధానం సంతోషం ప్రేమను పంచటానికి ఏసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలో జన్మించాడన్నారు ప్రపంచం మొత్తం క్రీస్తు జననం క్రిస్మస్ను నిర్వహించుకుంటున్నారు.


చార్మినార్ నియోజకవర్గంలోని పురానాపూల్ డివిజన్ ప్రజలకు పెద్ద ఎత్తున క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ల క్రిస్టఫర్. బాలరాజ్. ఇజ్రాయిల్ లలితమ్మ టిఆర్ఎస్ నాయకుడు ఇలియాస్ ఖురేషీ. మంజుల తదితరులు పాల్గొన్నారు

 ప్రేమా..శాంతి,,,, ఆనందం,,, ఇదే యేసు క్రీస్తు సందేశం

సెయింట్ మార్క్స్ భాయ్స్ టౌన్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ప్రేమా..శాంతి, ఆనందం ఇదే యేసు క్రీస్తు సందేశమని బాయ్స్ టౌన్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ డైరెక్టర్ బ్రదర్ యేసుప్రభు హరన్, ప్రిన్సిపాల్ షోరెడ్డి వెల్లడించారు. మానవాళికి శాంతి, సంతోషం పంచడానికి భూలోకానికి విచ్చేసిన ప్రభువు కుమారుడు యేసు క్రీస్తు అని వారు పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో మినీ క్రిస్మస్ను నిర్వహించారు. మొదటగా విద్యార్థులు క్రీసు గీతాలు ఆలపించారు. పాఠశాలలో యేసు పుట్టుక వృత్తాంతాన్ని తెలిపే గుడిసెను అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ అనేది లాటిన్ పదమని, క్రిస్ మస్ భగవంతుడు లోకం కోసం తన కుమారున్ని త్యాగం చేయడం అనే అర్థం వస్తుందన్నారు. సర్వ మానవులు సుఖం, సంతోషంతో గడపాలని, మీరు మీ తోటివారిని, ఇతరులను ప్రేమించండి, శాంతిని కల్పించాలనే బోధనలు చేశారన్నారు. క్రిస్మస్ పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఎ ఆంథోని, మీడియా ఇన్ఛార్జి ఓంప్రకాశ్ దిల్లికర్, తదితరులు పాల్గొన్నారు. భాషాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరం

బహదూర్ పుర మండల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహ్మద్ ముఖ్రమ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

భాషాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని బహదూర్ పుర మండల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహ్మద్ ముఖ్రమ్ అన్నారు. మంగళవారం నాడు బహదూర్ పుర మండల భాషా కాంప్లెక్స్ సమావేశం ఉన్నతి అభ్యసనాభివృద్ది కార్యక్రమం తెలుగు కార్యక్రమం హరిబౌలి లోని రిఫొయే ఆం ఉన్నత పాఠశాల లో జరిగిన సమావేశాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాతృ భాష తర్వాత ద్వితీయ భాష ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. విద్యార్థులకు చదవడం, చదివింది అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నది వ్యక్తపరచడం ఉన్నతి యొక్క మూల సూత్రాలని అన్నారు. బహదూర్ పుర డిప్యూటీ ఐ.ఓ హరినారాయణ,


షా గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాజీద్అలీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల అఫ్జల్ గంజ్ ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు కాంప్లెక్స్ ఇన్చార్జ్ పీ.ఎల్.పద్మజా కుమారి, రిఫాయే ఆం ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్.ఎం.మధుసుదన్, రిసోర్స్ పర్సన్ లు డాక్టర్.ఎస్. విజయ భాస్కర్, వి.కరుణాకర్ రెడ్డి, మీనాకుమారి, ఉప్పల కవిత , ఉపాధ్యాయులు డాక్టర్ శ్రీవాటి శ్రీనాథ్, కె.నరసింహాచారి, ఇ.బానురేఖ, ఆర్.శ్రీలత, బబిత, డిఆర్పి శ్రీనాథ శర్మ బహదూర్ పుర మండల తెలుగు పండితులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.


 జనరల్ బాడి సమావేశం విజయవంతం

గాంధీపురా గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు పి. లక్ష్మణ్ వెల్లడి 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

గాంధీపురా గంగ పుత్ర సంఘం జనరల్ బాడి సమావేశం విజయవంతంగా జరిగిందని ఆసంఘం అధ్యక్షుడు పి. లక్ష్మణ్, సంఘం ముఖ్య కార్యదర్శి బండారి కిషోర్ కుమార్. వైస్ ప్రెసిడెంట్ సి.కిరణ్ కుమార్. కోశాధికారి ఎం.ధనరాజ్, యూత్ ప్రెసిడెంట్ కె. కృష్ణమోహన్ తదితరులు ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని గాంధీపురా గంగ పుత్ర సంఘ భవనంలో జరిగిన ఈ జనరల్ బాడీ సమావేశంలో సంఘ అభివృద్ధి, సంఘం విస్తరణ, తదితర అంశాను చర్చించినట్లు వారు వెల్లడించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్పూర్తి, చైతన్యం మున్మందు కూడా కొనసాగించాలని వారు కోరారు.  సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలి

అయ్యప్ప స్వామి పడిపూజలో పులిపాటి రాజేష్ కుమార్ ప్రార్థన

మహాలక్ష్మి గ్యారంటీ అమలుపై సంబరాలు

మిఠాయిలు పంచిన పులిపాటి రాజేష్ కుమార్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె ఆరోెగ్యంగా ఉండాలని బహదూర్పురా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి పులిపాటి రాజేష్ కుమార్ ( రాహుల్ ) ఆకాంక్షించారు. శనివారంనాడు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా నియోజకవర్గం లోని కిషన్ బాగ్ డివిజన్ నందిముస్లయిగూడ ప్రాంతంలో అన్నం కృష్ణ శ్రీకాంత్, డప్పు వినోద్ స్వాములు వారు నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో  బహదూర్పురా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి పులిపాటి రాజేష్ కుమార్ ( రాహుల్ ) పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి పులిపాటి రాజేష్ కుమార్ పూజలు చేశారు. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న సోనియా గాంధీ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామి వారిని పులిపాటి రాజేష్ కుమార్ కోరారు. 

మహాలక్ష్మి గ్యారంటీ అమలుపై మిఠాయిలు పంచి సంబరాలు

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలోని మహాలక్ష్మి గ్యారంటీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం అమలు చేసిన సందర్భంగా బహదూర్పురా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి  పులిపాటి రాజేష్ కుమార్ ( రాహుల్ ) ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారుు. ఈ సందర్భంగా పాల్గొన్న స్థానిక మహిళలు కూడా హర్షం వ్యక్తంచేశారు.


 

 సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన

జలపల్లి యూత్ వింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్

(జానో జాగో వెబ్ న్యూస్ -మహేశ్వరం ప్రతినిధి)

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి  బిఆర్ఎస్ పార్టీ నుంచి శాసన సభ్యురాలుగా ఘన విజయం సాధించిన  పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డికి జలపల్లి యూత్ వింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. సబితా ఇంద్రారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యతను నిజాయితీగా నెరవేర్చానని యంజాల అర్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం మా కాలనీ అభివృద్ధికి సహకరించాలని అమ్మ గారిని ప్రార్థించడం జరిగిందని యంజాల అర్జున్ తెలియజేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసిన వారిలో వెంకటేష్ నాయక్. బలగం సిద్దు. గంగానాయక్. వీరేశం. బాబు నాయక్ తదితరులు ఉన్నారు.

 ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న

(జానో జాగో వెబ్ న్యూస్- హైద్రాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా చార్మినార్ శాసనసభ నియోజకవర్గం-66 పరిధిలోని 202 పోలింగ్ కేంద్రాలలో అసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు .బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని  కమల నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలోని  డి ఆర్ సి కేంద్రంలో  పోలింగ్ ఏర్పాట్లు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకన్న వివరించారు. చార్మినార్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 226117 మంది ఓటర్లు ఉండగా....  ఇందులో పురుషులు-118272. మహిళలు-107815. థర్డ్ జెండర్ -30 మంది ఉన్నారు.


91 భవనాల్లో 202 పోలింగ్ కేంద్రాలు ఉండగా...133 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్ని పోలి కేంద్రాలలో ప్రత్యేక సిసి కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘాతో భద్రత చర్యలు చేపట్టామన్నారు.  డి ఆర్ సి కేంద్రం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈ వి ఎం లు, ప్రెసిడింగ్ ఆఫీసర్లు లు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ల ల తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమించి మొత్తం 1,050 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు తరలించమన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఓటర్లు అందరికీ  సిబ్బందితో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామన్నారు.

ప్రజలందరూ తమ ఓటు  హక్కును బాధ్యత గా వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందు ఇప్పటికే  అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ల ను చైతన్య  పరిచామన్నారు.  100% శాతం  పోలింగ్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి  శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా  నోడల్ అధికారి  పర్యవేక్షణ లో పటిష్టమైన భద్రత చర్యలు   చేపట్టమన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో  సి- విజిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఎన్నికలకు సంబంధించి ఏవైనా అక్రమాలు, సమస్యలు తలెత్తితే  అందులో ఫిర్యాదు చేయాలని సూచించారు.


పచ్చజెండా జాగాలో హస్తం జెండా రెపరెపలు

బహదూర్ పురాలో కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ బైక్ ర్యాలీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీ అంటే పచ్చ జెండా...ఎంఐఎం అంటే పాతబస్తీ అన్నట్లుగా ఎవరైనా చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు ధీటుగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది. నిత్యంజనంలో ఉంటూ బహదూర్ పురాలో కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ బైక్ ర్యాలీ విస్త్రుత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. జనంతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొన్నారు. ఇదిలావుంటే మంగళవారంనాడు బహదూర్ పురాలో కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ బైక్ ర్యాలీనిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని నినాదాలతో బైక్ ర్యాలీలో హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పాతబస్తీలో మార్పు వస్తుందని వారు పేర్కొన్నారు. పోలింగ్ రోజు ప్రజలు పెద్దఎత్తున్న వచ్చి కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని వారు కోరారు.
 మహేశ్వరంలో వార్ వన్ సైడే

ప్రచారంలోనూ..ఆదరణలోనూ సబితా రెడ్డిదే పై చేయి

చేసిన అభివృద్ధి శ్రీరామ రక్ష

గెలుపుపై ధీమాతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రత్యర్థుల అంచనాలకు దొరకకుండా జనంలోకి

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య వార్ హోరాహోరీగా సాగినా మహేశ్వరంలలో మాత్రం వార్ వన్ సైడ్ గానే కనిపిస్తోంది. నియోజకర్గంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాధించిన పట్టుయే ఇందుకు కారణం. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా మహేశ్వరం చెప్పవచ్చును.  గ్రామీణ,పట్టణ ఓటర్ల కలయికతో,రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలతో మినీ ఇండియాను తలపిస్తుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 52 కంపెనీలు రాగా,లక్ష ఉద్యోగాలు లభించే ఫ్యాక్స్ కాన్ కూడా ఈ ప్రాంతంలో రానుండటంతో మరో సైబరాబాద్,మరో గచ్చిబౌలిగా ఈ ప్రాంతం మారబోతుంది.భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా రెడ్డి కోరిక మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు 6600 కోట్లతో మెట్రో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వాగ్దానం చేసారు. 


అభివృద్దికి చిరునామాగా మారిన సబితా ఇంద్రారెడ్డి

అభివృద్ది అంటే గుర్తొచ్చే నేతగా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరుతెచ్చుకొన్నారు. వాటికి అనుగుణంగానే మహేశ్వరం నియోజకవర్గ ములో 176 కోట్లతో 450 పడకల ఆస్పత్రితో మెడికల్ కళాశాల మంజూరు కాగా మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి లు శంకుస్థాపన సైతం చేసారు. ఇవే కాకుండా పెద్ద ఎత్తున విద్యాలయాలు, రోడ్లు,నాళాల అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్ పార్కులు,చెరువుల సుందరికరణ,లాంటి కార్యక్రమాలతో పాటు సుమారు 3 వేల కోట్లతో ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి చేసారు.మహేశ్వరం నియోజకవర్గములో రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు 389 కోట్లు,రైతు భీమా ద్వారా 24 కోట్లు,రుణమాఫీ క్రింద 87 కోట్లు ,ఆసరా పెన్షన్లు 576 కోట్లు,కళ్యాణాలక్ష్మి కింద 108 కోట్లు,షాది ముబారక్ పథకంతో 51 కోట్లు,ముఖ్యమంత్రి సహాయనిది తో 15 కోట్ల ప్రభుత్వ సహయం అందింది.


నియోజకవర్గములోని పట్టణ ప్రాంతాల్లో 16 కోట్లతో సమీకృత మార్కెట్ సముదాయాల నిర్మాణం,8 కోట్లతో మోడ్రెన్ దోబీ ఘాట్ లు, గొర్రెల పంపిణీకి 42 కోట్లు,చేపల పంపిణీకి 5 కోట్లు,ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవం పొందిన 2029 మంది మహిళలకు కేసీఆర్ కిట్లు,నియోజకవర్గములో 84 కుల సంఘాలకు స్థలాలు కేటాయించి ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించి పనులకు శంకుస్థాపనలు చేసారు.మహేశ్వరం నియోజకవర్గములోని బడంగ్ పేట్,మీర్ పేట్,తుక్కుగూడ,జల్ పల్లి జంట కార్పొరేషన్లు,జంట మునిసిపాలిటీలలో  832 కోట్ల రూపాయల భారీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలో ట్రoక్ లైన్లు,నాళాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపటం జరిగింది.


నాలాల అభివృద్ధికి 110 కోట్లతో   మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి.తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 280 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది.నియోజకవర్గంలో బడంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి,తుక్కుగూడ ల పరిధిలోని 11 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపట్టడం జరిగింది.మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లై ఓవర్,నియోజకవర్గానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాము అని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.


నియోజకవర్గములో 176 కోట్ల రూపాయల భారీ నిధులతో మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేయగా వచ్చే విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి వస్తుంది.1200 కోట్లతో కొత్తపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,10 కోట్లతో జల్ పల్లిలో 30 పడకల ఆస్పత్రి,6 కోట్లతో మహేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకలుగా అప్ గ్రేడ్ చేయటం జరిగింది .అదేవిధంగా 13 బస్తీ దవాఖానలు,8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు,16 పల్లె దవాఖానలు ఏర్పాటు చేసారు. మహేశ్వరం నియోజకవర్గములో 280 కోట్ల భారీ నిధులతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాము.40 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేశాము. పురాతన దేవాలయాల అభివృద్ధికి 10 కోట్లు,450 కోట్లతో రోడ్ల అభివృద్ధి, పంచాయతి రాజ్ శాఖ ద్వారా 284 కోట్లు,దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  మహేశ్వరం పర్యటనలో160 కోట్ల నిధుల వరాల జల్లు కురిపించగా  పనులు జరుగుతున్నాయి. 


జనమే ప్రాణంగా....ఎదిగిన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి

జన కోసమే జనమే ప్రాణంగా ఎదిగిన నాయకురాలు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్న భావన మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రజల్లో ఉంది. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నియోజకవర్గములో సబితా ఇంద్రారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.ఒక్క రోజులో 18 గంటల వరకు కూడా నియోజకవర్గ పర్యటనలు చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తుండటంతో ప్రజలందరి చేత మన్ననలు పొందుతున్నారు.తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా భూదేవి అంతా ఓపిక,ఓర్పు,సహనంతో సబితా రెడ్డి పనిచేస్తారని సాక్ష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.తన నియోజకవర్గములోని ముంపు ప్రాంతాల సమస్యలపై పేపర్ల క్లిప్పింగ్స్, వీడియోలు,తాను మోకాల్లోతు నీళ్లలో తిరిగిన విధానం చూసి జంట నగరాల్లో, శివారు మునిసిపాలిటీ లలో వేయి కోట్లతో నాలాల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు అవి నేడు సత్పలితాలు ఇస్తున్నాయన్నారు.అది సబితా రెడ్డి పుణ్యమే అంటూ ప్రకటించటంపై కాలనీల వాసుల నుండి హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి.


నియోజకవర్గముపై ఇంత మనసు పెట్టి పనిచేసే ఎమ్మెల్యే దొరకటం మహేశ్వరం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొనటంతో నియోజకవర్గములో సబితా రెడ్డి గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పవచ్చును.విద్యా శాఖ మంత్రిగా బిజీగా ఉన్న రోజుకు ఒకేసారి అయిన నియోజకవర్గ పర్యటన చేస్తారని ప్రజలే చర్చించుకుంటున్నారు.కరోన సమయంలో అయితే నియోజకవర్గముతో పాటు రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల్లో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని వాళ్ళు నేడు ఓట్ల కోసం వస్తున్నారని ఆమె తన ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు.

ఉద్దండులతో పోటీ అయిన వార్ వన్ సైడే

గతానికి భిన్నంగా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఉద్దండ నేతను బరిలోకి దించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డియే టార్గెట్ గా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించింది. దీంతో మహేశ్వరంలో రసోత్తరమైన పోటీ అని తొలుత భావించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపట్టిన ప్రచారంతో నియోజకవర్గంలో ఆమె ప్రభంజనం ఖాయమన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం నియోజకవర్గములో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక రియల్ లీడర్ తో పోటీ చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డి పేర్కొంటున్నారు.


తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని తెల్లవారు జామున లేచినప్పటి నుండి రాత్రి వరకు ప్రజాసేవలోనే ఉంటానని అంటున్నారు. కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే తనపై పోటీ చేసి ఓడిపోయారని అప్పటి నుండి ప్రజలకు కనిపించకుండా పోయి ఎన్నికలు రాగానే నేడు సేవ అంటూ ముందుకువస్తున్నారని  ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా తనను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని ఆమె ధీమాతో ఉన్నారు.రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,సబితా రెడ్డి మల్లీ గెలిచి మంత్రి అవుతారని బిఆర్ఎస్ నేతలు,అభిమానులు పేర్కొంటున్నారు. ఇతర పార్టీల వారు గెలిస్తే ఎమ్మెల్యేకె పరిమితం అవుతారని నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుంటుందని,అభివృద్ధి కొనసాగలంటే సబిత రెడ్డి రావాలని బిఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు సైతం పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో బలమైన ఏకైక మహిళా నేతగా ఎదిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహిళ హోమ్ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ప్రభుత్వంలోను మొదటి మహిళ మంత్రిగా పనిచేస్తున్నారు.రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న ఏకైక మహిళగా సబితా రెడ్డి నిలిచారు.మహేశ్వరం నియోజకవర్గములో కూడా ఆమె అభ్యర్థిత్వానికి మహిళలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఒక మహిళతో ఎంతో మంది నేతలు పోటీ పడుతున్నారని పార్టీలకతీతంగా మహిళల మద్దతు సబితా రెడ్డికే ఉంటుందని బిఆర్ఎస్ మహిళ సంఘ నేతలతో పాటు,వివిధ మహిళ సంఘాలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి.ఇలా ఏ కోణంలో చూసిన మహేశ్వరం నియోజకవర్గములో సబితా ఇంద్రారెడ్డి ముందంజలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిఘా సంస్థలు,వివిధ సర్వేలలో కూడా ఇదే స్పష్టం అవుతోంది.