రైతన్నలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

సిపిఐ (యంయల్) రేవ్యులేషన్ ఇంట్రాక్ట్ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ఉమ్మడి నంద్యాల,కర్నూలు జిల్లాలో కురిసిన మండస్ తుఫాన్ కురిసిన వర్షాల వల్ల ఉమ్మడి నంద్యాల,కర్నూలు జిల్లాలలో పంటలు దెబ్బతిన్న రైతన్నలను ఆదుకోవడం లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలం అయ్యిందని సిపిఐ (యంయల్) రేవ్యూలేషన్ ఇంట్రాక్ట్ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.ఈ సందర్భంగా సిపిఐ (యం  యల్) కార్యకర్తలతో మాట్లాడుతూ


ఉమ్మడి నంద్యాల,కర్నూలు జిల్లాలో గతంలో కురిసిన వర్షాల వల్ల చేతికి వచ్చిన పంటలు నష్టపోయిన రైతన్నలను ఆదుకోవడంలో వ్యవసాయ సంబంధిత అధికారులు,నాయకులు విఫలమైయ్యారని వారు ఆరోపించారు.రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులను పట్టించుకోక పోవడం చాలా దారుణమన్నారు.రైతులను విస్మరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం కార్యదర్శి ఆనంద్,చంద్రుడు,భాషా, క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: