నకిలీ ముద్రలను తయారు చేసి ట్యాంపరింగ్ చేసే,,,

ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి(ఐపీఎస్)

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం మండలంలో నకిలీ ముద్రలు తయారు చేసి ట్యాంపరింగ్ చేయు ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాలలోకి వెళితే... పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ వీఆర్వో గా పని చేస్తున్న వనమోజ విజయ్ శ్రీనివాస్(28) 6.12.2022 వ తేదీన పాణ్యం పోలీసు స్టేషన్ లో పిన్నాపురం గ్రామమునకు చెందిన ఆర్ఎస్ఆర్-1908 రికార్డులో నకిలీ సీల్లు వేసి ట్యాంపరింగ్ జరిగిందని పాణ్యం పోలీసు స్టేషన్లో 06.12.2022 వ తేదీన పాణ్యం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఓందుట్ల గ్రామానికి చెందినభూమని నాగేశ్వర రావు (42)తన గ్రామముకు దగ్గరలోనే ఉన్న పాణ్యం మండలములోని పిన్నాపురం గ్రామములొ గ్రామానికి చెందిన కరిమద్దెల చిన్న సుబ్బయ్య,రాముడు మరియు అతని అక్క కరిమద్దెల నాగమ్మ గ్రామములొ నివాసము ఉండడము లేదని,పొలాలు చాలా సంవత్సరముల నుండి సాగు చేయడము లేదని పొలాలను స్వాదీనము చేసుకోవాలని, నకిలీ ఆదార్ కార్డ్ లతో 28.08.2020 వ తేదీన పాణ్యం సబ్ రిజిస్టర్ ఆఫీసులో  తన  భార్య సరస్వతి పేరున మరియు పిన్నాపురం ఎల్లప్ప మరియు ఎల్లయ్య  గోపవరం గ్రామము, మహానంది మండలము పేరున రిజిస్టర్ చేయించినాడని భూమని నాగేశ్వర రావు,మరియు ఇంకొందరి పైన పాణ్యం పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేశారు.


ఈ విషయమై భూమన నాగేశ్వరరావు కు మరియు కరిమద్దెల చిన్న సుబ్బయ్య మరియు రాముడు మద్య సివిల్ కోర్ట్ లో కేసు  పెండింగ్ లో ఉంది.పొలము గురించి కేసులు పెండింగ్ లో ఉన్నందున రెవెన్యూ అదికారులు ఆన్ లైన్ ఆడంగల్ లో రెడ్ గుర్తులో పెట్టారని, భూమినినాగేశ్వర రావు తన సమీప బంధువైన పాణ్యం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఆవుల శేషాద్రి సహాయం కోరగా,RSR 1908 రిజిస్టర్ లో వివాదము లో ఉన్న పొలము సర్వే నంబర్ ఎదురుగా మీ పూర్వీకుల పేర్లు ఉంటే ఆ పొలము  విషయములో సివిల్ కోర్టు నందు తీర్పు అనుకూలముగా వస్తుందని,పిన్నాపురం గ్రామ పొలాల్లో సుమారు 140 ఎకరాల పొలాలు గ్రీన్ కో సోలార్ కంపెనీ ఎకరాకు 10 లక్షలు ఇచ్చి తీసుకుంటారని,సర్వే నెంబర్లలో కూడా మీ పూర్వీకుల పేర్లు ఉంటే సోలార్ కంపెనీ నుండి డబ్బులు వస్తాయని,ఆ మొత్తాన్ని మనం పంచుకొందామని,భూమని నాగేశ్వర రావు స్నేహితులైన గువ్వల వెంకట రమణ మరియు కొట్టము వెంకట రమణలు కలసి RI శేషాద్రి సలహాలు మరియు సహకారముతో నంద్యాల టౌన్ లో ఉన్న శ్రీరామ్ కంప్యూటర్ రబ్బర్ స్టాంప్స్ వద్ద నాగేశ్వర రావు మరియు వెంకట రమణ ల పూర్వీకుల పేర్లు మరియు వారికి అనుకూలమైన ఇంకొంతమంది పూర్వీకుల పేర్లతో నకిలీ స్టాంప్ లు తయారు చేయించి RI శేషాద్రి సహకారంతో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని తెలిపారు.పొలం మొత్తం విస్తీర్ణం సుమారు 140 ఎకరములు ఉంటుందని, ట్యాంపరింగ్ కు పాల్పడిన ఓందుట్ల గ్రామానికి చెందిన భూమని నాగేశ్వరరావు(42), పిన్నాపురం గ్రామానికి చెందిన గువ్వల వెంకటరమణ(45), నోస్సుం గ్రామానికి కొట్టం వెంకటరమణ లను పాణ్యం మండలం బలపనూరు మెట్ట జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వద్ద వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ట్యాంపరింగ్ ఉపయోగించిన 19 సీల్లు,01 ఆర్ఎస్ఆర్  రికార్డు మరియు 01 స్టాంపు పాడ్ ను స్వాధీన పరుచుకున్నామని,పాణ్యం తహశీల్దార్ ఆఫీసులో పని చేయుచున్న RI శేషాద్రి పరారీలో ఉన్నారని, అతన్ని పట్టుకొనడానికి ప్రత్యేక బృందాలను నియమించమని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.ఈ కేసు దర్యాప్తు లో ప్రత్యక శ్రద్ద కనబరచిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని నంద్యాలజిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: