క్రమశిక్షణ నేర్పించాల్సిన  పిఈటి టీచర్...

విద్యార్థినిపై  చేయి చేసుకొని, చెంప పై కడ్డితో కాల్చడం దుర్మార్గమైన చర్య

బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘాల మండిపాటు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం లో ఉన్న కేజీబీవీ పాఠశాలలో  పిఈటి ఉపాధ్యాయుని పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని చెంపపై కాలుతున్న కడ్డీతో శిక్షించడం ఎంతవరకు సమంజసం అని బిసి ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాలలోకి వెళితే కొత్తపల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో క్రమశిక్షణ నేర్పించి పిల్లలు మానసికంగా,శారీరకంగా ఎదుగుదలకు సంసిద్ధులను చేయవలసిన పి ఈ టి ఉపాధ్యాయురాలు విద్యార్థిని చెంపపై ఇనుప కడ్డీతో శిక్షించడం ఎంతవరకు సమంజసం అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు మరియు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ, మాట్లాడుతూ కొత్తపల్లి మండలం లో ఉన్నటువంటి కేజీబీవీ స్కూల్లో  పదవ తరగతి చదువుతున్న అభం శుభం తెలియని విద్యార్థినులపై ఉపాధ్యాయురాలు ఇలాంటి దుచ్చుర్యలకు పాల్పడడం చాలా బాధాకరమని బీసీ ఎస్సీ  ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని, విద్యార్థినిపై పిఈటి ఉపాధ్యాయురాలు  చెంపపై కాలుతున్న కడ్డితో  విద్యార్థినిపై దాడి చేయడం చాలా దారుణమైన చర్య అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పిఈటి టీచర్ చేతిలో దాడికి గురైన విద్యార్థిని

ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినిలపై దారుణంగా దాడికి దిగజారితే విద్యార్థినిలకు రక్షణ ఎక్కడ ఉంటుందని, ఉపాధ్యాయుల ప్రవర్తనల వల్ల విద్యార్థులు ఉపాధ్యాయుల చేతిలో కూడా బలి అయ్యే విధంగా విద్యాసంస్థలు మారుతున్నాయని,విద్యార్థులు చిన్నచిన్న తప్పులు చేస్తే వాటిని సరిదిద్ది క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినిలపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తే విద్యార్థినిలకు రక్షణ ఎలా వస్తుందని వారు అన్నారు. విద్యార్థినిపై దుచ్చర్యకు పాల్పడిన పి ఈ టి ఉపాధ్యాయులు పై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన ప్రజా సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై నంద్యాల జిల్లా జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీ, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: