సాంబవరం మండల పరిషత్ పాఠశాలకు బోధన పరికరాలు పంపిణీ చేసిన....
ప్రవాస భారతీయుడు డాక్టర్ గోరంట్ల వాసు బాబు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గోస్పాడు మండల పరిధిలోని సాంబవరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు నాణ్యమైన బోధనతో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నేర్పించాలనే ఉద్దేశంతో సుమారు 30 వేల విలువచేసే బోధనా ఆభ్యాసన పరికరాలను పాఠశాల ఉపాధ్యాయులు నూర్ భాషా గారి సహకారంతో బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్న గ్రామానికి చెందిన డాక్టర్ గోరంట్ల వాసు బాబు (యూఎస్ఏ) గారు ఉచితంగా పంపిణీ చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరుడు తెలిపారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి మరియు ముఖ్య అతిధులు మాట్లాడుతూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ గోరంట్ల వాసు బాబు గారు పేద విద్యార్థుల మీద మమకారంతో సుమారు 16 జిల్లాల్లో 210 పాఠశాలలకు సుమారు కోటి రూపాయలకు విలువ పైగా విలువైన బోధన అభ్యాస పరికరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
సాంబవరం గ్రామం గురించి,విద్యార్థుల గురించి తెలియకపోయినా కేవలం గ్రామీణ విద్యార్థుల అభివృద్దే ధ్యేయంగా ఈ పరికరాలని అందజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల ఎంపీడీవో శ్రీమతి సుగుణశ్రీ,,ఎంఈఓ అబ్దుల్ కరీం,సర్పంచ్ ఐజయ్య, ఎంపీటీసీ శ్రీమతి భారతమ్మ,ఏఎంసి చైర్మన్ భాస్కర్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు డాక్టర్ గోరంట్ల వాసు బాబు సేవలను కొనియాడారు.
Home
Unlabelled
సాంబవరం మండల పరిషత్ పాఠశాలకు బోధన పరికరాలు పంపిణీ చేసిన.... ప్రవాస భారతీయుడు డాక్టర్ గోరంట్ల వాసు బాబు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: