చందనం (సంద) చెరువు పరిసరాలను పరిశీలించిన మంత్రి సబితారెడ్డి

సౌకర్యలపై వాకర్స్ తో వకాబు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం (సంద) చెరువు వద్ద  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర‌భంగా మంత్రి చెరువు వద్ద వాకింగ్ చేస్తున్న వారితో మాట్లాడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాల గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగాల ఈవెంట్ లకు సిద్ధం అవుతున్న అభ్యర్థులతో మాట్లాడి అల్ ద బెస్ట్ చెప్పారు.


చెరువు చుట్టూ వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన బండ్ తో పాటు పిల్లలు ఆడుకోవడానికి,చిన్న పెద్ద సెదదిరాటానికి చేసిన ఏర్పాట్లపై ప్రజలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.చెరువును చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని, మినీ ట్యాంక్ బండ్ చాలా బాగుందని వారు మంత్రికి తెలిపారు. స్కెటింగ్ చేస్తున్న చిన్నారులతో మాట్లాడారు.గతంలో ఎక్కడ చేసే వారని అడిగారు.చెరువు చుట్టూ తిరిగి వాకింగ్ చేస్తూ అందరిని పలకరించారు.జాగింగ్ చేస్తున్న వారితో పాటు క్రీడాకారులు, యువతి,యువకులతో మాట్లాడారు.మంత్రితో చాలా మంది ఫొటోలు దిగటానికి పోటీ పడ్డారు.









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: