కేజీబీవీ సిబ్బంది జీతాలను వెంటనే చెల్లించాలి

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు యాదవ్ విజ్ఞప్తి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ఏ) ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న సిబ్బందికి నవంబరు నెల జీతాలు అందలేదనీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీలో దాదాపు 2,600 మంది పని చేస్తున్నారనీ,ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోతే వారి జీవన గమ్యం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లకు జీతాలను డిసెంబరు నెల ముగుస్తున్నా,నవంబరు నెల జీతాలు అందలేదనీ, ఎస్ఎస్ఎ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు రూ.70 కోట్ల రూపాయలను జిల్లాలకు పంపించామని రాష్ట్ర అధికారులు చెబుతున్నా సిబ్బందికి మాత్రం జీతాలు అందడం లేదనీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రతి నెల వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని  చెబుతున్నారనీ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వక పోతే వారు సమాజంలో ఎలా జీవిస్తారని,రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరారు,ప్రతి నెల ఒకటవ తేదీ వేతనాలు ఇవ్వాలని, ఖాళీ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని, విద్యుత్ శాఖ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

2023 సంవత్సరానికి కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పెండింగులో ఉన్న ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: