సమాజ హితమే ఆమె అభిమతం

- సమాజసేవలో ఆయిషా సుల్తానా 


మెతో నాలుగు మాటలు మాట్లాడితే అందులో మూడు మాటలు సామాజిక సేవ గురించే. మానవ సేవంటే ఆమెకు అంతిష్టం. తనకు తెలిసిన వారికెవరికైనా కష్టమొచ్చిందంటే తల్లడిల్లిపోతారామె. ఆడ బిడ్డ పెళ్లి, వైద్యం, నీటి సౌకర్యం, పిల్లల చదువులు ఇలా ఎలాంటి సేవకైనా   వెనుకంజవేయరు. పాతబస్తీకి చెందిన ఆయిషా సుల్తానా ఏ మంచిపనికైనా ముందుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఎలాంటి నిరాశ్రయం లేకుండా నిద్రించే వారికి దుప్పట్లు కప్పి మానవత్వాన్ని చాటుకుంటారు. తరచూ వృద్ధాశ్రమాలను సందర్శించి వృద్ధుల కన్నీళ్లు తుడుస్తారామె. వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తారు. పండ్లు ఫలహారాలు అందించి అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరిగా జీవిస్తున్న పండుటాకులకు నేనున్నానని భరోసా నిస్తారు. జాతీయ దినోత్సవాల సందర్భంగా స్కూళ్లను సందర్శించి పిల్లలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. తమ సేవలకు ఖుర్ఆన్ బోధనలే ప్రేరణ అని చెబుతారు. 

ఫ్యామిలీ పాఠాలు..

జమాఅతె ఇస్లామీహింది ఉమెన్స్ వింగ్ సెక్రటరిగా సిటీలో పలు ప్రాంతాల్లో పర్యటించి మహిళా సాధికారతపై చైతన్యం కల్పిస్తున్నారామె. కుటుంబ వ్యవస్థ గొప్పతనంపై అవగాహన కల్పించేలా ఉపన్యాసాలు, ఫ్యామిలీ విలువలను పెంపొందించే ఎన్నో గెట్ టు గెదర్ కార్యక్రమాల్ని తరచూ ఏర్పాటు  చేయడం ఆమెకు పరిపాటే. 

మనమంతా ఒక్కటే..

అసమానతా భావాలు, అంటరానితనం, మహిళల అణచివేతపై ఆయిషా ఎప్పుడూ పోరాడుతుంటారు. సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తారు. మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలపై ఆమె అలుపెగని పోరాటం చేస్తున్నారు. ఎన్నో సదస్సులలో తమ వాణిని బలంగా వినిపిస్తారామె. తమ ముగ్గురు ఆడ పిల్లల్ని డాక్టర్ చదువులు చదివించి బురఖా ప్రగతికి అడ్డుకాదని నిరూపిస్తున్నారామె. కూతురు చదువు సమాజానికి వెలుతురు అని బలంగా చెబుతారామె!


సాహిత్య సభలు..

ఆమె నిర్వహణలో ఎన్నో సాహిత్య సభలు జరిగాయి. మహిళా దినోత్సవం, మాతృదినోత్సవం, ముహమ్మద్ ప్రవక్త జయంతి ఇలా ఎన్నో సందర్భాల్లో ఆమె సాహిత్య సభలు నిర్వహించారు. తెలుగు భాషకోసం పాటుపడుతున్న మహిళా రచయిత్రిల్ని, కవియిత్రిలను శాలువా, మెమొంటోతో సత్కరించి వారిని ప్రోత్సహిస్తారు. దీంతో ఎంతోమంది రచయిత్రిలు, కవియిత్రిలతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: