భావితరాలకు మన హిందుత్వం గురించి తెలియజేయాలి

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

శ్రీ ప్రభాత ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంబోత్సవానికి, గణపతి విగ్రహ ప్రతిష్టాపన హాజరైన బుక్క వేణుగోపాల్

ఘన స్వాగతం పలికిన  రామాజపురం గ్రమస్థులు

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

దైవకార్యాలతో మన హిందూ సంప్రదాయాలను కాపుడుకుంటూ భావితరాలకు మన హిందుత్వం గురించి తెలియజేయవలసిన అవసరం ఎంతగానో ఉందని బీజేపీ రాష్ట్ర నాయకలు బుక్క వేణుగోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారంనాడు రాజేంద్రనగర్ నియోజకవర్గ రామాజపురం గ్రామంలో నిర్మించిన శ్రీ ప్రభాత ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంబోత్సవానికి, గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఆయనతోపాటు భాగ్యనగర్ జిల్లా, రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి పదాధికారులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న తరలివచ్చారు.


ఈ సందర్భంగా రామాంజపూర్ గ్రామ సభ్యులు బుక్క వేణుగోపాల్ కు ఘనంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం బుక్క వేణుగోపాల్ ను స్వామివారి దర్శనాన్ని చేయించారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ ఇలాంటి దైవకార్యాలతో మన హిందూ సంప్రదాయాలను కాపుడుకుంటూ భావితరాలకు మన హిందుత్వం గురించి తెలియజేయవలసిన అవసరం ఎంతగానో ఉందని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రామాంజపూర్ గ్రామస్థులు రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్ , చంద్రయ్య, బైతి శ్రీధర్ ,బాత్కు శ్రీనివాస్, బుక్క ప్రవీణ్ కుమార్, కొండే మహేష్ యాదవ్, మెండే కుమార్ యాదవ్ బాసుపల్లి నవీన్ రెడ్డి తోపాటు బిజెపి బీజేవైఎం నాయకులు  పాల్గొన్నారు.

 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: