బీఆర్ఎస్ ఏపీ బాధ్యుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్

కేసీఆర్ సమాలోచనలు

జాతీయ పార్టీగా ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లో అడుగులు వేసే దిశగా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన టీఆర్ఎస్ పార్టీని.. బీఆర్ఎస్‌గా మార్చి.. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీకి కేసీఆర్ సై అంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పోటీకి సిద్ధం అవుతున్నామని ఆ పార్టీ నేతలు అప్పుడప్పుడు ప్రకటిస్తున్నారు. అయితే.. తాజాగా ఆంధ్రప్రేదేశ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఏపీలోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బాధ్యతలు ఏపీలో ఎవరు చూస్తారనే అంశం తెరపైకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి.. బీఆర్ఎస్ బాధ్యతలను తెలుగుదేశం పార్టీ మాజీ నేత, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కు ఇవ్వాలని.. కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానికి బీఆర్ఎస్ నాయకులు అనేక కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా.. మంత్రి తలసానికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు చాలామంది నేతలు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. పార్టీ మారిన తర్వాత కూడా తలసాని తన బంధాలను కొనసాగించారు. దీంతో శ్రీనివాస్ యాదవ్ అయితే.. గట్టిగా డీల్ చేస్తారని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.


అంతేకాదు.. ప్రస్తుతం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్.. పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సాయి కిరణ్‌ను బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. మంత్రి తలసానిని ఏపీలో పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లోనూ మంత్రి తలసాని ప్రభావం చూపారని అప్పట్లో వార్తలు వచ్చాయి. జగన్ గెలుపులో ఆయన కూడా కీలక పాత్ర పోషించారని ప్రచారం జరిగింది. దీంతో ఏపీ రాజకీయాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే అంశం కలిసొస్తుందని బీఆర్ఎస్ చీఫ్ ఆలోచనగా చెబుతున్నారు.

ఒకవేళ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఏపీ ఇంఛార్జ్‌గా నియమిస్తే.. చాలామంది టీడీపీ లీడర్లును బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఆయనకే ఏపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్.. తమకు మద్దతు ఇవ్వాలని అడిగితే ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తామని వెల్లడించారు. దీనిపై అందరితో చర్చించి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. ఒక రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని చెప్పారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: