అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
1.13కేజీల బంగారు,5.75 లక్షల నగదు,రెండు కార్లు స్వాధీనం
బనగానపల్లె సిఐ, ఎస్సైలను ప్రశంసించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
కర్నూల్, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 2021 వ సంవత్సరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాకు బనగానపల్లె పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళితే...నంద్యాల జిల్లాబనగానపల్లె పోలీస్ సర్కిల్ పరిధిలోని అవుకు మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లె సర్కిల్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తూ ప్రజల కంటికి నిద్రలేకుండా
దొంగలు హల్ చల్ చేస్తుండడంతో సవాలుగా తీసుకున్న బనగానపల్లె సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బనగానపల్లె, అవుకు ఎస్సైలు 3 టీంలుగా ఏర్పడి శుక్రవారం ఉదయం అవుకు సమీపంలోని ఉప్పాలపాడు ఆర్చి వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న గుత్తి కొండ పవన్ కుమార్(కార్తిక్), వేముల శివశంకర్(రాజు), తలారి మారెన్న అనే అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్దనుంచి నాలుగు జిల్లాలో 19 వివిధ దొంగతనాల్లో దోచుకున్న రూ.50.85 లక్షల విలువగల 1.13 కేజీల బంగారు ఆభరణాలను, రూ.5.75 లక్షల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
2022 జనవరి నెల నుంచి ఇప్పటివరకు వారు రాష్ట్రంలో జరిగిన పలు దొంగతనాలకు పాల్పడడినట్లు మీడియాకు తెలిపారు.అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన బనగానపల్లె సిఐ సుబ్బారాయుడు, అవుకు ఎస్సై జగదేశ్వర రెడ్డి, బనగానపల్లె, అవుకు పోలీస్ సిబ్బంది జిలానీ బాష,, ప్రసాద్, సుబ్బరామకృష్ణ, ప్రవీణ్ కుమార్, హోంగార్డు రఫీలను ఎస్పీ రఘువీర్ రెడ్డి అభినందించి ప్రశంసాపత్రాలను అందచేశారు.
Home
Unlabelled
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..... 1.13కేజీల బంగారు,5.75 లక్షల నగదు,రెండు కార్లు స్వాధీనం...... బనగానపల్లె సిఐ, ఎస్సైలను ప్రశంసించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: