తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అన్నారు

కానీ నేడు కేసీఆర్ తెలంగాణ దిశ మార్చారు

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అని నాడు కొందరు అన్నారని కానీ నేడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర దశనే మార్చేశారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  బుధవారంనాడు కొత్తూరు, గఫూర్ నగర్  గ్రామాలలో  92 లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన పనులు ముందుగా చేపట్టాలని ఆదేశిస్తారని, అందులో భాగంగా ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.


పెన్షన్లు, రేషన్ కార్డులు అర్హులైన వారికి అందిస్తామని పేర్కొన్నారు. పల్లె ప్రగతి తో గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, చెత్త రహిత స్వచ్ఛ గ్రామాలుగా మారుతున్నాయన్నారు. తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అన్న చోట నుండి 24 గంటల విద్యుత్, రైతు పంట పెట్టుబడికి రైతు బంధు, అటు చినుకులు ఇటు అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయన్నారు. కొత్తూర్ గ్రామంలో ప్రతి ఏటా రూ. 2 కోట్ల 20 లక్షలు వచ్చాయన్నారు. రైతు  శాశించే వాడిగా ఉండాలని నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్లు, కులం, మతం, వర్గం, పార్టీ తేడా లేకుండా అందరికి ఈ పథకం ఎలాంటి దరఖాస్తు,సిఫార్సు లేకుండా వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రైతు చనిపోతే భీమా 5 లక్షలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అన్నారు.

బీపీ షుగర్ ఉన్న వాళ్లకు ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్, తాజాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో నేడు ప్రారంభించారని మంత్రి పేర్కొన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. స్వంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవటానికి 3 లక్షలు ఇస్తాం అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే బాబా సాహెబ్ అంబెడ్కర్  ఆశయాలు నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని ఆమె తెలిపారు.  రెండవ విడత లో కొత్తూర్ గ్రామాన్ని తీసుకుంటామని, దశల వారిగా అందరికి అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి , జడ్పీటీసీ జంగారెడ్డి, పార్టీ అధ్యక్షులు జయేందర్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

 






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: