నారాయణ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన...

నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ధనుంజయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలు అనుమతులు లేని పాఠశాలలను ప్రభుత్వ విద్యాశాఖ అనుమతులకు విరుద్ధంగా నడుపుతున్నారని, పర్యవేక్షణ లేని విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థ ల్లో జరుగుతున్న విద్యార్థిని విద్యార్థుల ఫీజుల పైన విద్యా సంబంధిత అధికారులు దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నంద్యాల పట్టణంలో ఎన్జీవోస్ కాలనీలో అనుమతులులేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా నారాయణ విద్యాసంస్థలు ఒక బ్రాంచ్ పెట్టి స్కూల్ నడుపుతున్న నారాయణ స్కూల్ పై అధికారులు కన్నెత్తి చూడడం లేదని, నారాయణ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, ఏజీఎంలు ఫీజుల కోసం విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారని,


విద్యార్థులను చదువుల పేరుతో వత్తిడి తెస్తున్న ఆర్ఐఓ,డిఈఓ లు నారాయణ స్కూల్ వైపు కన్నెత్తి చూడడం లేదని, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా నారాయణ స్కూల్స్ పై ఆర్ఐఓ,డిఈఓ అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని,తక్షణమే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని,చర్యలు తీసుకోనీ పక్షంలో స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్,ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తామని, అధికారులు చర్యలు తీసుకోకపోతే నంద్యాలలో నారాయణ విద్యా సంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి ఎర్రి స్వామి,నాయకులు వెంకటేష్,చంద్రశేఖర్, రామాంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: