కేసీఆర్ ప్రత్యేక చొరవతో....రోడ్డు విస్తరణ  పనులు

ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నా

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆర్సిఐ  గేట్  రావిరాల కమాన్ నుండి  కొంగరకలాన్  వరకు 9 కోట్ల 50 లక్షల రూపాయలతో మంజూరైన ఆర్ అండ్ బి  రోడ్డు పనులకు  రావిర్యాల వాటర్ ట్యాంక్ దగ్గర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్ల విస్తరణ, మరమ్మతులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు  ప్రజల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రోడ్డు పనులు ఏప్రిల్ వరకు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు అదేశించమన్నారు. రోడ్డు పనులు ముందుగా సి ఆర్ ఎఫ్ నుండి 30 కోట్లతో చేపట్టాలని భావించిన రావీర్యాల వరకే ఆ నిధులు సరిపోవటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి 9 కోట్ల 50 లక్షలు మంజూరు ఇచ్చారని పేర్కొన్నారు.


ఈ ప్రాంత ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పిఆర్,ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి కృషి కృషి చేస్తున్నట్లు తెలిపారు. శంషాబాద్ నుండి కోళ్ల పడకల్ రోడ్డును 14 కోట్లతో విస్తరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. మహేశ్వరం నుండి తిమ్మాపూర్ రోడ్డు వెడల్పు ప్రతిపాదనలు కూడా పంపినట్లు తెలిపారు. రావీర్యాల నుండి సర్దార్ బాగర్ రోడ్డును కూడా విస్తరిస్తాం అన్నారు. రావీర్యాల చెరువు కట్ట వద్ద  బండ్ నిర్మించి సుందరికరిస్తాం అన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: