వక్స్ బోర్డు భూములను కాపాడండి
ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎండి యూనస్ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా ముస్లిం హక్కుల పోరాట సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. ఎస్ఎండి యూనుస్ మాట్లాడుతూ వక్స్ బోర్డు భూములను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నంద్యాలలో అన్యకాంతమైన ( వక్ఫ్ భూమి) 73.ఎకరాలు రైతు నగరం దగ్గర ఉన్న భూమిలో ముస్లిం సోదరులు ఈదుగా మరియుస్మశాన వాటిక కోసం 5. ఎకరాలు అడగడం జరిగిందనీ, అధికారులకు చెప్పి సంవత్సర కాలమవుతున్నా ఇంతవరకు స్పందన లేకపోవడం సూచనీయమని, ఆంద్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా నంద్యాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఈషాక్ భాష ఆఫీస్ లో అడగడం జరిగిందనీ,ముస్లింల వక్ఫ్ బోర్డు లో ఉన్న ఆస్తులు అడుగుతున్నామనీ, ముస్లింల ఆస్తులను అప్పనంగా దార దత్తం చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తుందని,ఇప్పటికైనా ముస్లిం వర్క్స్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం స్వాధీన పరుచుకొని నిరుపేద ముస్లింల కు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందిగా ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. ఎస్ఎండి యూనుస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Home
Unlabelled
వక్స్ బోర్డు భూములను కాపాడండి ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎండి యూనస్ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: