ప్లాట్ కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన... పట్టించుకోని పోలీసులు

న్యాయం చేయాలని ఓ బాధితుడి ఆవేదన

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

చట్టబద్ధంగా కొనుక్కున్న ప్లాట్ కబ్జా చేసిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని మెదక్ జిల్లాకు చెందిన సయ్యద్ నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను విదేశాలకు వెళ్లి సంపాదించుకున్న డబ్బుతో 2007 లొ వాదీ ఏ హబీబ్ సర్వే నెంబర్ 157 లొప్లాట్ నెంబర్ 63లొ 200 గజాల ప్లాట్ కొనుక్కున్నారని ఆయన తెలిపారు. ఫ్లాట్ ను రిజిస్టర్ కూడా చేయించుకున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇటీవల తానుకున్న ఫ్లాట్ ను చూసేందుకు వెళ్లగా అక్కడ తన స్థలంలో రెండు ఇళ్ళు నిర్మించి ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయమై తాను బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. తర్వాత తాను కోర్టును సంప్రదించి కోర్టు ద్వారా కేసు నమోదు చేయించానని భాదితుడు తెలిపాడు, ఈ విషయం పై బాలాపూర్ ఇన్స్పెక్టర్ బి భాస్కర్ కు  వివరణ కోరగా కేసు నమోదు చేశామని నోటీసులు ఇచ్చామని విచారణ చేసి న్యాయం చేస్తామన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: